పెద్ద సినిమా, చిన్న సినిమా అని చూసే రోజులు పోయాయి. కథలో కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చి అలా కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఎన్నో చూసాం. ఇక మన తెలుగు హిట్ సినిమాలను కూడా బాలీవుడ్ అక్కడ రీమేక్ చేసుకొని సొమ్ములు చేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీమేక్ చేశాయి.. కొన్ని లైన్ లో ఉన్నాయి.. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ వచ్చిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘మత్తు వదలరా’ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ చేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దర్శకుడైన రితేష్ రానా హిందీ వెర్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో వున్నాడట. నిజానికి ఈ సినిమాను మొదటనే తెలుగు, హిందీలో తెరకెక్కించాలని అనుకున్నారట కానీ వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారట. వచ్చే ఏడాది సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. హిందీలో ఎవరు నటిస్తారు తదితర వివరాలు త్వరలో తెలియచేయనున్నట్టు తెలుస్తుంది.
కాగా ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాళభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘మత్తు వదలరా’. ఈ సినిమా ద్వారా రితేష్ రానా అనే దర్శకుడు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిన్న సినిమాను చిరంజీవి (చెర్రీ) నిర్మించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: