కె.జి.యఫ్2 అంతకు మించి అంటున్న ‘రాఖీ భాయ్’..!

KGF 2 Will Be Much More Exciting and Entertaining Than KGF Says Actor Yash

ఫుల్ మాస్ కమెర్షియల్ మూవీ కె.జి.యఫ్ హిట్ తర్వాత ఈ సినిమా సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలు.. ఇంకా హిందీలో కూడా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రాఖీ భాయ్ గా యష్ చేసిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతంచేసుకున్నాడు యష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ దశలో వుంది. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. పరిస్థితులు బాగుండి వుండే మరో రెండు మూడు నెలల్లో రిలీజ్ అయ్యేదే. కానీ కరోనా వల్లా ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోయాయి. ఈ ఏడాది కాదు కదా వచ్చే ఏడాది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

అసలే సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు తాజాగా యష్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. కె.జి.యఫ్2 చాలా భారీగా ఉండబోతుంది… మీరు కె.జి.యఫ్ 1 చూసారు కదా.. ఆ సినిమా ఎలా ఉందో తెలుసు కదా.. అంతకు ఐదింతలు ఉంటుంది కె.జి.యఫ్2 అని చెప్పాడు. ఇంకా కొన్ని రోజుల షూటింగ్ మిగిలి వుంది.. కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు మొదలుపెడతాం అని చెప్పాడు. దీనితో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =