‘యష్’ తనయుడు ‘ఆయుష్’ సూపర్ జోష్‌ డ్యాన్స్..!

KGF Fame Actor Yash Posts An Adorable Video Of His Baby Boy On Social Media

కన్నడ స్టార్ హీరో యష్ తన పిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. అక్టోబ‌ర్ 30, 2019న వీరికి ఆయుష్‌ జ‌న్మించ‌గా, మే 1న తొలిసారి కుమారుడి ఫోటోని షేర్ చేశాడు యష్. అప్పటినుండి కుమారుడికి సంబంధించిన ఫోటోలు త‌ర‌చూ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తనయుడు ఆయుష్ కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఏంటంటే..ఆయుష్ టాయ్ కారులో మ్యూజిక్ కి జోష్‌తో డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక ఆ వీడియోను తీసి యష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ యష్ హీరోగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 14 =