లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు కూడా ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా వుంటూ అప్పుడు తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తున్నాడు. ఇక ఇటీవలే నేషనల్ స్కూల్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ లో రన్నర్ అప్ గా మెడల్ తీసుకుంటున్న ఫోటోను సుధీర్ బాబు తన ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి ఫొటోనే ఒకటి షేర్ చేసాడు. తన చిన్ననాటి ఫొటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ… ఈ ఫొటోలో వున్నది నా చిన్నప్పటి ఫ్రెండ్ రాము.. ఇప్పుడు నాని సిస్టర్ ను పెళ్లి చేసుకున్నాడు.. ప్రపంచం ఎంత చిన్నది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Few got it right … It’s my childhood friend Ramu, who got married to @NameisNani‘s sister 😃 The Earth is such a small planet you see 😂 https://t.co/Gd11blhPSj
— Sudheer Babu (@isudheerbabu) July 14, 2020
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ తెరకు పరిచయమైన సుధీర్ బాబు… ఆ తరువాత హీరోగా పలు విభిన్నమైన స్టోరీలు ఎంపికచేసుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2018 లో సమ్మెహనం , నన్నుదోచుకుందువటే సినిమాలతో మంచి హిట్స్ తెచ్చుకున్న సుధీర్ ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ లో నటించాడు. కరోనా కారణంగా ఆ మూవీ విడుదల వాయిదా పడింది. దీనితో పాటు పుల్లల గోపిచంద్ బయోపిక్ లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: