బిగ్ బాస్ 4 – 6వ వారం నామినేషన్ లిస్ట్

Bigg Boss 4 Show To Bring Out The Contestants Elimination List For The 6th Week

బిగ్ బాస్ సీజ‌న్ 4 – ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సుజాత వెళ్ళిపోతూ బిగ్ బాంబు వేయడంతో ఈ వారం మొత్తం సోహైల్ గిన్నెలు తోమాల్సి వచ్చింది. బిగ్ బాంబ్ లో భాగంగా సోమ‌వారం రోజు ఎపిసోడ్ సోహైల్ గిన్నెలు క‌డుగుతుండ‌డాన్ని చూపించారు. అయితే ప‌ర్స‌న‌ల్ క‌ప్పులు కూడా క‌డ‌గ‌కుండా అక్కడే పెట్టి వెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండటంతో అమ్మ రాజశేఖర్ కలుగ చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. అయినా వినకపోవడంతో అక్కడ పెట్టెయ్ నేనే కడుగుతా అని అమ్మ రాజశేఖర్ చెప్పడంతో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త వాదన జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో మెహ‌బూబ్, అరియానా కలుగచేసుకొని వారించారు. అయితే మెహ‌బూబ్ చెప్పిన మాట విన్న సోహైల్‌.. అరియానా చెబుతున్న స‌మ‌యంలో విన‌కుండా ప‌క్క‌కు వెళ్లడంతో ఈ విష‌యంలో హ‌ర్ట్ అయిన అరియానా.. ‘ఇదే అతి. నిన్న చెప్పింది కూడా ఇదే. కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి. పెద్ద పొగరేందో’ అంటూ గ‌ట్టిగా అరిసింది. ఇక్క హైలైట్ ఏంటంటే సోహైల్ మాత్రం ఏ మాత్రం కోప్పడకుండా తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కెమెరా ముందు నిలుచొని త‌న కంప్లైంట్ చెప్పాడు. అరియానా కూడా త‌న వ‌ర్షెన్‌ను బిగ్ బాస్‌కు తెలియ‌జేసింది. కెప్టెన్‌గా ఉన్న సోహైల్ హౌజ్‌మేట్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేశాడు. రాజ‌శేఖ‌ర్‌తో, అరియానాతో జ‌రిగిన ఇష్యూపై మాట్లాడిన సోహైల్ ఈ వారం మొత్తం ఎలా చేయాలి అనే దానిపై చ‌ర్చించారు. ఈ చర్చలో కుమార్ సాయి.. సోహైల్‌కు గ‌ట్టిగానే గొడవపడ్డారు.

మరోవైపు అభిజిత్‌ మోనాల్ శనివారం నాగార్జున అడిగిన ఇష్యూ పై చర్చించుకున్నారు. . అఖిల్‌కి నీ మీద అంత ప్రేమ ఉంటే.. నేషనల్ టీవీలో వచ్చేస్తుందని అంటే.. నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ప్రస్తావించాడు.నీ బెడ్ రూంలో కూర్చుని అఖిల్‌ది తప్పని అన్నావ్.. నాగ్ సార్ ముందు ఇద్దరిదీ తప్పు అంటావా? నాకు నువ్ ఏం చేస్తున్నావో అర్థం కావ‌డం లేద‌ని పేర్కొన్నాడు అభి. దీనికి మోనాల్ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా మాట్లాడ‌క‌పోవ‌డ‌మే నాకు బెట‌ర్ అనిపిస్తుంది. మాట్ల‌డ‌క‌పోతే క‌నీసం ఇద్ద‌రం హ్యాపీగా అయిన ఉంటాం అని అన్నాడు.

ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం కూడా కాస్త సీరియస్ గానే నామినేషన్ ప్రక్రియ జరిగింది. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో నామినేట్‌ చేయాలనుకునే ఇద్ద‌రు వ్యక్తుల‌ మెడలో ఎండు మిర్చిల దండ వేసి.. అనంతరం కారణం చెప్పాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ ఆదేశించారు. ముందుగా అరియానా మెహబూబ్, మోనాల్ ల‌ని నామినేట్ చేసింది. ఇక దివి – నోయల్, మెహబూబ్.. నోయల్ – దివి, అభిజిత్.. హారిక – అరియానా, కుమార్ సాయి.. అభిజిత్ – మెహబూబ్, అఖిల్.. లాస్య – మెహబూబ్, దివి.. మెహబూబ్ – దివి, అరియానా.. సొహైల్ – అరియానా, కుమార్ సాయి .. రాజ శేఖర్ మాస్టర్ – లాస్య, అభిజిత్… అవినాష్ – దివి, అభిజిత్, మోనాల్ – అరియానా, దివి .. అఖిల్ – అభిజిత్, అరియానా .. కుమార్ సాయి – హారిక, సొహైల్ ల‌ను నామినేట్ చేశారు.

దీంతో ఈ వారం నామినేష‌న్‌లో మెహబూబ్, అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఉన్నారు. ఇందులో ఒక‌రు లేదా ఇద్ద‌రు వ‌చ్చే వారం బిగ్ బాస్ హౌజ్‌ను వీడ‌నున్నారు. బిగ్ బాస్ ప్ర‌త్యేక అధికారం ఉన్న సోహైల్‌కు నామినేష‌న్‌లో ఉన్న ఒక‌రిని సేవ్ చేయోచ్చ‌ని పేర్కొన్నాడు. దీంతో మొద‌టి నుండి త‌న‌కు స‌పోర్ట్‌గా ఉంటున్న మెహ‌బూబ్‌ని సేవ్ చేశాడు. మెహబూబ్ మినహా మిగిలిన వారందరూ నామినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఇంటిని వదిలి వెళతారో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − nine =