“శ్రీ మహాలక్ష్మి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ మలయాళ , తమిళ , కన్నడ , తెలుగు భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పూర్ణ ప్రస్తుతం 100(కన్నడ ), “తలైవి “(తమిళ ), ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్కిడ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ పై నంది అవార్డ్ విన్నర్ కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధానపాత్రలో “బ్యాక్ డోర్ “మూవీ రూపొందనుంది. “బ్యాక్ డోర్ “మూవీ పూజా కార్యక్రమాలు సోమవారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ .. ఈ రోజుల్లో బ్యాక్ డోర్ ఎంట్రీ కామన్ అనీ , బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే పరిణామాల నేపథ్యం లో ఈ మూవీ రూపొందుతుందనీ , “బ్యాక్ డోర్” మూవీ హీరోయిన్ పూర్ణ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందనీ చెప్పారు. నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. “బ్యాక్ డోర్ “మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని , దర్శకుడు బాలాజీ ఈ మూవీ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనీ చెప్పారు. “బ్యాక్ డోర్ “మూవీ లో ఛాలెంజ్ రోల్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక , నిర్మాతలకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: