‘కేస్‌ 99’ నుండి ఫస్ట్ ఫైల్

Case 99 First File Is Out

నిఖిల్‌ ,అనువర్ణ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేస్‌ 99’. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రమిదని ఇప్పటికే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ ఫైల్ అంటూ ఒక చిన్న టీజర్ ను రిలీజ్ చేసారు. ‘ఎందుకు క‌లిశావు..‌ఎందుకు మాట్లాడావు..ఎందుకు నవ్వావు..అంటూ తిరువీర్ వాయిస్ ఓవ‌ర్ తో మొద‌లయే టీజ‌ర్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అమ్మాయి క‌న‌బ‌డ‌టం లేదు..బాడీ దొర‌కడం లేదు’ అంటూ ప్రియ‌ద‌ర్శిని రామ్ సంభాష‌ణ‌ల‌తో సాగే టీజ‌ర్ సస్పెన్స్ గా సాగుతుంది. ‌మరి థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చూడబోతే కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.

 

ఇంకా ఈ సినిమాలో ‘పలాస’ఫేమ్‌ తిరువీర్‌, అపరాజిత, రోషన్, అజయ్,అశోక్‌రావ్,ప్రణీత పట్నాయక్‌ (కేర్‌ ఆఫ్‌ కంచెరపాలెం) , క్రిష్‌రాజ్,మనోజ్‌ ముత్యం,విజయ్‌ గోపరాజుతదితరులు నటిస్తున్నారు.
మెలోడ్రామా అనే కంపెనీ ద్వారా గౌతమ్, కీర్తీ, వివేక్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ద‌స‌రా-దీపావ‌ళి సీజ‌న్ లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eight =