“లవ్ స్టోరీ ” డిసెంబర్ లో రిలీజ్ ?

Naga Chaitanya and Sai Pallavi's Love Story Movie To Hit Theatres In December

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “లవ్ స్టోరీ ” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసి డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ లో హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటించడం విశేషం. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =