‘పెళ్లి సందడి’ కోసం శ్రీకాంత్ తనయుడు

Tollywood Veteran Director K Raghavendra Rao To Relaunch Srikanth Son Roshan With This Super Hit Movie Sequel

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. అంతేకాదు రెండు రోజుల క్రితమే ఈ సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఈ సినిమా టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతల వివరాలు రివీల్ చేసిన ఆయన.. హీరోహీరోయిన్ల పేర్లు మాత్రం సీక్రెట్‌గా ఉంచారు. దీనితో హీరో.. హీరోయిన్స్ ఎవరబ్బా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ ను తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి సందడితో హీరో శ్రీకాంత్ కెరీర్‌‌ని మలుపుతిప్పిన దర్శకేంద్రుడు ఇప్పుడు కొత్త పెళ్లి సందడితో శ్రీకాంత్ తనయుడు రోషన్ కెరీర్ నిలబెట్టాలని ప్లాన్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. మరి చూదాం ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.