“అంధాధున్ ” తమిళ రీమేక్ లో ఐశ్వర్య రాయ్ ?

Aishwarya Rai In Talks To Play Tabu Role In Andhadhun Tamil Remake

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ “అంధాధున్ ” ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ టబు నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు “అంధాధున్ ” మూవీ పలు భాషలలో రీమేక్ అవుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా “అంధాధున్ ” మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. హిందీ లో టబు నటించిన పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు. “అంధాధున్ ” మూవీ ఇప్పుడు తమిళ భాషలో రీమేక్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటుడు , నిర్మాత , దర్శకుడు త్యాగరాజన్ తన తనయుడు ప్రశాంత్ హీరో గా “అంధాధున్ ” మూవీని తమిళ భాషలో తెరకెక్కించనున్నారు. ఈ తమిళ రీమేక్ మూవీ లో టబు నటించిన పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ సంప్రదిస్తున్నట్టు సమాచారం. హీరో ప్రశాంత్ , ఐశ్వర్య జంటగా రూపొందిన “జీన్స్ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 22 సంవత్సరాల తరువాత వారిద్దరూ జంటగా నటించడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ ఐశ్వర్య ప్రస్తుతం మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =