సక్సెస్ ఫుల్ “లీడర్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి “కృష్ణం వందే జగద్గురుమ్ “, “బాహుబలి “, “బాహుబలి 2”, “ఘాజీ “, నేనే రాజు నేనే మంత్రి ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రానా బెస్ట్ విలన్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. తెలుగు భాషతో పాటు తమిళ , హిందీ భాషల మూవీస్ లో నటించిన రానా ప్రస్తుతం ఆ భాషల చిత్రాల కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రానా హీరోగా రూపొందుతున్న “విరాటపర్వం “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన “అరణ్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా హీరోగా తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న “1945 ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న “హిరణ్య కశ్యప ” వెయిటింగ్ లో ఉంది. నటుడు , నిర్మాత గా బిజీగా ఉన్న రానా ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ , 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “గృహం ” మూవీ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ కి “ధీరుడు “టైటిల్ యాప్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: