“పుష్ప” షూటింగ్ పునః ప్రారంభం

Pushpa Movie Team Resumes Shooting Work After Lockdown

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ రూపొందుతుంది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శాండల్ వుడ్ లో బిజీగా ఉన్న హీరో , క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధనంజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్నఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న “పుష్ప ” మూవీ కరోనా కారణంగా నిలిచిపోయింది. 7 నెలల తరువాత “పుష్ప ” మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో ఈ రోజు (నవంబర్ 10) పునః ప్రారంభం అయ్యింది. దర్శకుడు సుకుమార్ , హీరో అల్లు అర్జున్ సెట్స్ లో అడుగుపెట్టారు. షూటింగ్ పునః ప్రారంభం కావడంతో దర్శకుడు సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు సుకుమార్ , హీరో అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “పుష్ప ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − twelve =