‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్ రిలీజ్

Anand Deverakonda's Latest Movie Middle Class Melodies Trailer Is Out

విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఆనంద్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌ రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ ను చూస్తే మంచి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇందులో రాఘవ అనే యువకుడిగా కనిపిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. తండ్రి నిర్వహించే టిఫిన్ సెంటర్ లో ‘బాంబే చట్నీ’ అనే స్పెషల్ చట్నీ తయారు చేయడంలో రాఘవ ఫేమస్. దీంతో రాఘవ గుంటూరు కు వెళ్లి హోటల్ పెడితే సక్సెస్ అవుతుందని గుంటూరులో హోటల్ ఏర్పాటు చేయాలని చూస్తాడు. కానీ హోటల్ మాత్రం రన్ అవ్వదు. మరి రాఘవ తన హోటల్ బిజినెస్ ను ఎలా సక్సెస్ ఫుల్ గా రన్ చేసాడు అన్నది మిగిలిన సినిమా. చూడబోతే ఈ సినిమాతో ఆనంద్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. మరి చూద్దాం హిట్ కొట్టాడో లేదో తెలియాలంటే మాత్రం ఇంకో పదిరోజులు ఆగాల్సిందే.

 

కాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ లో వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − 1 =