యంగ్ హీరో నితిన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `గుండె జారి గల్లంతయ్యిందే`(2013) ఒకటి. ఈ సినిమాతోనే దర్శకుడిగా తొలి అడుగేసిన విజయ్ కుమార్ కొండా.. మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయం అందుకున్నాడు కూడా. అయితే, సెకండ్ వెంచర్ గా రిలీజైన `ఒక లైలా కోసం` (2014) మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మ్ చేయలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ `ఒరేయ్… బుజ్జిగా` తెరకెక్కించాడు. రాజ్ తరుణ్, మాళివికా నాయర్, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్… ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. `గుండె జారి గల్లంతయ్యిందే` ఎలాగైతే వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదలైందో.. అలాగే `ఒరేయ్ బుజ్జిగా` కూడా అదే ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. అంతేకాదు.. `గుండె జారి గల్లంతయ్యిందే`లో `ఇష్క్` జోడీ నితిన్, నిత్యా మీనన్ జట్టుకడితే.. `ఒరేయ్.. బుజ్జిగా`లో `కుమారి 21ఎఫ్` పెయిర్ రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జట్టుకట్టారు.
[custom_ad]
మరి.. `గుండె జారి గల్లంతయ్యిందే` తరహాలోనే హిట్ పెయిర్, సేమ్ సీజన్ ఫార్ములాతో వస్తున్న `ఒరేయ్ బుజ్జిగా` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























