సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించారు. నిజానికి షూటింగ్ ప్రారంభమైన సమయంలో ఒక లుక్ ను వదిలారు. దీనితో మరి ఇప్పుడు రాబోయే ఫస్ట్ లుక్‌లో వైష్ణవ్‌ను ఎలా చూపిస్తారా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా ఇప్పుడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Presenting the First Look of #Uppena 🌊
Experience the Ocean of Love in Theatres from April 2nd, 2020 ❤️#UppenaOnApril2nd#UppenaFirstLook 🌊
Introducing actors #PanjaVaisshnavTej, #KrithiShetty and Director #BuchiBabuSana 😊
A Rockstar @ThisIsDSP Musical 🎶 pic.twitter.com/8zDGKQZ4aM
— Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2020
[custom_ad]
కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
కాగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు పది మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి ఈ హీరో అదృష్టం ఎలా ఉందొ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: