కమెడియన్ సునీల్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సునీల్ కు గొంతులో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కావడంతో… గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సునీల్ కి వైద్యులు చిక్కిత్స అందిస్తున్నారు. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక ఈ వార్తలపై స్పందించిన సునీల్ తాను ఆరోగ్యంగా ఉన్నానని.. కేవలం సైనస్ అండ్ చిన్న ఇన్ఫెక్షన్ కారణంగా చెకప్ కోసం హాస్పిటల్ కి వచ్చానని.. అయితే డాక్టర్స్ సూచన మేరకు టెస్ట్ లు కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యానని.. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని సునీల్ స్పష్టం చేశారు.
కాగా.. ఇటీవల సునీల్ అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక రేపు విడుదల కాబోయే డిస్కో రాజా సినిమాలో కూడా సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























