త‌క్కువ గ్యాప్ లో శ్ర‌ద్ధా క‌పూర్ సీక్వెల్స్

Shraddha Kapoor Comes With Back To Back Sequel Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Shraddha Kapoor Latest News,Shraddha Kapoor Upcoming Movie News,Actress Shraddha Kapoor New Movie News,Shraddha Kapoor Next Film Updates

గ‌త ఏడాది ఆగ‌స్టులో విడుద‌లైన `సాహో`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఎంతో చేరువ‌య్యింది బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్. కాగా, `సాహో`కి ముందు హిందీనాట శ్ర‌ద్ధ న‌టించిన ప‌లు చిత్రాలు విజ‌య‌ఢంకా మ్రోగించిన‌ప్ప‌టికీ… త‌న‌కి విశేష గుర్తింపుని తీసుకువ‌చ్చింది మాత్రం `ఆషిఖీ 2` అనే చెప్పాలి. 90ల్లో వ‌చ్చిన `ఆషిఖీ`కి టైటిల్ సీక్వెల్ గా వ‌చ్చిన ఈ మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ శ్ర‌ద్ధా క‌పూర్ కి ఎన‌లేని పేరు ప్ర‌ఖ్యాతుల‌ను తీసుకువ‌చ్చింది. ఈ సీక్వెల్ తీసుకువ‌చ్చిన గుర్తింపుతో ఆ త‌రువాత `ఏబీసీడీ2`, `రాక్ ఆన్ 2` వంటి సీక్వెల్స్ లోనూ సంద‌డి చేసింది శ్ర‌ధ్ధ‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అయితే… వీటిలో `రాక్ ఆన్ 2` అంత‌గా ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. క‌ట్ చేస్తే… సుదీర్ఘ విరామం త‌రువాత ఈ టాలెంటెడ్ బ్యూటీ నుంచి మ‌రో రెండు సీక్వెల్స్ రాబోతున్నాయి. `ఏబీసీడీ` ఫ్రాంఛైజీలో మూడో చిత్ర‌మైన `స్ట్రీట్ డాన్స‌ర్ 3డి` ఈ నెల 24న రిలీజ్ కానుండ‌గా.. `బాఘీ` ప్రాంచైజీలో మూడో సినిమా అయిన `బాఘీ 3` మార్చి 6న విడుద‌ల కానుంది. మ‌రి.. త‌క్కువ గ్యాప్ లోనే రానున్న ఈ సీక్వెల్స్ శ్ర‌ద్ధ‌కి ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twenty =