డిస్కో రాజా ఆల్ రె’ఢీ ‘ ఫర్ రిలీజ్

Disco Raja Movie Pre Release Business

వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజకు ఈ నెల 24న విడుదల కానున్న ” డిస్కో రాజా” నుంచి కం బ్యాక్ ఫిలిం అవుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.ఇంతవరకు తను చేయని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా చేశారు రవితేజ. తనదైన స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో  యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేస్తూ టాప్ హీరో గా ఎదిగిన రవితేజ “డిస్కో రాజా ” లో సైన్స్ ఫిక్షన్  నేపథ్యంలో ఒక  విభిన్న తరహా క్యారెక్టర్ చేయటంతో అంచనాలకు ఆస్కారం ఏర్పడింది. దానికి తోడు ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం చిత్రాల ద్వారా క్యాపబుల్  డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న విఐ ఆనంద్ దర్శకత్వం డిస్కో రాజా మీద అంచనాలు పెరగడానికి కారణమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే కాస్టింగ్ , టెక్నికల్ సపోర్ట్ , మేకింగ్ వేల్యూస్ పరంగా  డిస్కో రాజా కు ట్రేడ్ వర్గాలలో మంచి
హైప్ ఏర్పడింది. ముఖ్యంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంచలన సంగీత తరంగం తమన్ మ్యూజిక్ డిస్కో రాజాకు మంచి ప్లస్ అయింది. అలాగే ముగ్గురు గ్లామర్ డాల్స్ నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ లతో పాటు ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ విలన్ క్యారెక్టర్ చేయడంతో సినిమాకు మంచి కాస్టింగ్ వెయిట్ ఏర్పడింది.

[custom_ad]

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ గొప్ప యాడెడ్ ఫ్యాక్టర్ అయింది. వీటన్నింటినీ మించి నిర్మాత రామ్ తాళ్లూరి మేకింగ్ వేల్యూస్ టాప్ రేంజ్ లో ఉండటంతో బయ్యర్లకు ఇదొక ప్రామిసింగ్ ప్రాజెక్ట్ అనే నమ్మకం కుదిరింది.ఇన్ని ప్లస్ పాయింట్స్ కారణంగా డిస్కో రాజా కు మంచి బిజినెస్ జరిగింది. ఏరియాల వైజ్ గా
డిస్కో రాజా బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

నైజాం : 6.00
సీడెడ్ : 2.75
నెల్లూరు :0.65
కృష్ణ      :1.25
గుంటూరు : 1.25
వైజాగ్.      : 1.95
ఈస్ట్.         : 1.25
వెస్ట్           :. 1.05
ఏపి+టి ఎస్ : 16.40
కర్ణాటక       : 1.10
రెస్టాఫ్ ఇండియా : 0.50
ఓవర్సీస్.            : 1.50

టోటల్  : 19.50

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో సరిగమ సినిమాస్ విడుదల చేస్తుండగా ఈరోజు యూఎస్ ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. రేపు అంటే జనవరి 24న ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు రెస్టాఫ్ ఇండియాలో షో లు పడతాయి.

[custom_ad]

జనవరి 26 రవితేజ బర్త్ డే కు 24న విడుదల కానున్న ” డిస్కో రాజా” మంచి బర్త్ డే గిఫ్ట్ అవుతుందని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.