రోజాకు బాలయ్య దిష్టిబొమ్మ..!

RGV Shocking Comments On Roja And Balakrishna Picture

ఏంటబ్బా వర్మ ఇంత సైలెంట్ గా వున్నాడు అనుకునేలోపే అబ్బే అదేం లేదు అన్నట్టు మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈసారి వర్మ ట్వీట్లకు బలైంది ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు బాలకృష్ణ. గతంలో మెగా ఫ్యామిలీ పై పలు కామెంట్స్ వేసి.. మెగా అభిమానులకు కోపం తెప్పించిన వర్మ.. ఈసారి బాలయ్య ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలు కలిసి ఇటీవల ఓ సందర్భంలో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని రోజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే వర్మకు ఛాన్స్ దొరికింది అన్నట్టు.. ఆ ఫొటోను వర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ బాలయ్యపై దారుణమైన కామెంట్స్ చేశారు. ‘వావ్.. రోజా గారు అచ్చం హీరోలా ఉన్నారు. ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు కానీ చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నాడు. రోజా పక్కన కూర్చుని ఆమె అందానికి మచ్చ తెస్తున్నాడు. బహుశా అతను రోజాకి దిష్టిబొమ్మ అనుకుంటా’’ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. ‘అందమైన రోజా పక్కన కూర్చుని ఫొటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో నాకు ఎవరైనా చెప్తారా?’ అని ప్రశ్నించారు.

[custom_ad]

[custom_ad]


[custom_ad]

మరి ఈ రేంజ్ లో కామెంట్స్ వేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. రివర్స్ లో వర్మపై కౌంటర్ లు స్టార్ట్ చేశారు. ‘లయన్ బాలయ్య పక్కన కూర్చుని ఫొటోను పాడుచేసిన ఆ వ్యక్తి ఎవరో చెప్తారా’ అంటూ వర్మకు కౌంటర్ వేశారు. అంతేకాదు కొంతమంది అభిమానులు ఇంకోసారి బాలయ్య జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. మరి వర్మ దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడతాడా..? లేక ఎప్పటిలాగే మళ్ళీ ఫ్యాన్స్ రెచ్చగొట్టేలా ట్వీట్స్ చేస్తాడా..? చూద్దాం ఈ వార్ ఎంత వరకూ వెళుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.