వర్మ వెబ్ సిరీస్ లో ఇషా..!

Isha Koppikar To Act In RGV Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Isha Koppikar,Actress Isha Koppikar,Heroine Isha Koppikar,Isha Koppikar Latest News,Isha Koppikar New Movie News,Isha Koppikar Next Project News,RGV Web Series,RGV Latest Web Series

రామ్ గోపాల్ వర్మ మేధావి అంటుంది ఒక సీనియర్ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు ఇషా కొప్పికర్. ఈ టైం లో ఆమె వర్మ ను పొగడటానికి కారణం ఏంటబ్బా అంటే.. ప్రస్తుతం ఆమె వర్మ తీస్తున్న వెబ్ సిరీస్ లో నటిస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం సినిమా తెస్తాడో.. ఎప్పుడు వెబ్ సిరీస్ అంటదో చెప్పడం కష్టం. ఒక పక్క సినిమాలు తెస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాగాజా మరో వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఇషా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మపై ప్రశంసలు కురిపించింది. రామ్‌ గోపాల్‌ వర్మ ఒక మేధావి అని, తన కెరీర్‌ పరంగా ప్రస్తుతం వర్మ బ్యాడ్‌ ఫేజ్‌లో ఉన్నప్పటికీ భారత సినిమా రంగానికి ఆయన చేసిన సహాకారం మరువలేనిది అన్నారు. వర్మ అనేక గొప్ప సినిమాలు తెరకెక్కించారు. ఆయన తీసిన సినిమాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వర్మ సినిమాల్లో నేను చూసిన మొదటి హిందీ హర్రర్‌ చిత్రం రాత్‌. అది నాకు ఎంతోగానో నచ్చింది. ఆ తరువాత భూత్‌, రంగీలా, సత్యా వంటి సినిమాలు చేశారు.

ప్రస్తుతానికి వెబ్‌ సిరీస్‌ ప్రధాన భాగం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ వెబ్‌ సిరీస్‌ను వర్మ నేతృత్వంలో నలుగురు దర్శకులు డైరెక్షన్‌ చేశారు. షూటింగ్‌ పూర్తి చేసి వర్మకు అప్పగించారు. వర్మ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చూసుకుంటున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో మ్యాజిక్‌ క్రియోట్‌ చేస్తుందని ఆశిస్తున్నా’’. అంటూ చెప్పుకొచ్చారు. మరి చూద్దాం ఇంత పొగిడేసిందంటే.. ఈ సినిమాలో ఎంత విషయం ఉందొ. ఈ వెబ్ సిరీస్ ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =