అమలా పాల్, ముంబై సింగర్ భవ్నీందర్ సింగ్ గతకొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఇప్పటికే పలు వార్తల్లో చూశాం. ఇక ఈ వార్తలు కూడా నిజమే అని ఒప్పేసుకుంది కేరళ బ్యూటీ అమలా పాల్. గతంలోనూ భవ్నీందర్ ఆడై సినిమా ప్రమోషన్ల సమయంలో.. నా ప్రేయసిని చూసి గర్వపడుతున్నాను. మున్ముందు కూడా ఇలాగే నీ సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కొన్నిసార్లు వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సైతం పంచుకున్నాడు. దీనితో అప్పుడే ఫిక్స్ అయిపోయారు అమలా పాల్ బాయ్ ఫ్రెండ్ ఇతనే అని. ఇక అమలా పాల్ కూడా ఒప్పుకోవడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అమలా పాల్ కూడా రెండో పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావుడి లేకుండా.. ఎవరికీ చెప్పకుండా చాలా సైలెంట్‌గా తను ప్రేమించిన అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకుంది. అమలా పాల్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





ఇక తన అందం, అటు అభినయంతో ఆకట్టుకుంటుంది ఈ మలయాళ భామ. ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయింది అమలా పాల్. సినీ విషయాల్లో మాత్రమే కాకుండా వ్యకిగత విషయాల్లో కూడా వార్తల్లో ఉంటుంది. వరుస సినిమాలతో కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే..దర్శకుడు ఏఎల్ విజయ్ ని 2014 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరికీ మనస్పర్ధలు రావడంతో 2017లో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ మాజీ భర్త విజయ్ ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకోవడం, ఇటు అమలాపాల్ కూడా సినిమాల్లో బిజీ అయిపోవడం .. ఇప్పుడు తను కూడా రెండో పెళ్లి చేసుకోవడం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























