ర‌జినీకాంత్ ని డైరెక్ట్ చేయ‌నున్న రాఘ‌వ లారెన్స్?

Raghava Lawrence To Direct Super Star Rajinikanth

వ‌రుస చిత్రాల‌తో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ జోరు మీదున్నారు. గ‌త ఏడాది సంక్రాంతికి `పేట‌`తోనూ.. ఈ సంవ‌త్స‌రం సంక్రాంతికి `ద‌ర్బార్`తోనూ ప‌ల‌క‌రించిన ర‌జినీ.. ఈ ద‌స‌రాకి `అణ్ణాత్త‌` (తెలుగు టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంది)తో సంద‌డి చేయ‌నున్నారు. ఆపై త‌న మిత్రుడు, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో త‌న 169వ సినిమా చేయ‌నున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ఈ లోపే త‌న 170వ సినిమాని కూడా ఫిక్స్ చేశార‌ట ర‌జినీ. ఆ వివ‌రాల్లోకి వెళితే… ర‌జినీ వీరాభిమాని, మ‌ల్టీటాలెంటెడ్ రాఘ‌వ లారెన్స్ ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ని సంప్ర‌దించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ వినిపించాడ‌ట‌. త‌న ఏజ్, ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా ఉన్న ఆ క‌థ న‌చ్చ‌డంతో.. లారెన్స్ కి ర‌జినీ వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. త్వ‌ర‌లోనే ర‌జినీ, రాఘ‌వ లారెన్స్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి… ద‌ర్శ‌కుడిగా కెరీర్ లో సింహ‌భాగం విజ‌యాలు అందుకున్న లారెన్స్… ర‌జినీతోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి.

ఇదిలా ఉంటే… రాఘ‌వ లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న తొలి హిందీ చిత్రం `ల‌క్ష్మీ బాంబ్` (`కాంచ‌న‌` రీమేక్) నిర్మాణ ద‌శ‌లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 18 =