నాని ‘V’ – ముగిసిన చోట నుండే ప్రారంభం

Interesting Update About Nani V Movie

నిజానికి ఒక సినిమా సూపర్ హిట్ అయితే కానీ దాన్ని సీక్వెల్ ను తీయడానికి ఆలోచిస్తారు దర్శనిర్మాతలు. సీక్వెల్ కు సరిపడా గట్టి కథ దొరికిందా.. వెంటనే సీక్వెల్ ప్లాన్ చేసేస్తారు. అయితే ఇక్క ఒక సినిమాపై మాత్రం ఇంకా రిలీజ్ కాకముందే సీక్వెల్ ఉంటుందేమో అన్న వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు… ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’. ఇప్పటికే ఈ సినిమా మంచి బజ్ ను సొంతం చేసుకుంది. నాని నెగిటివ్ షేడ్ లో నటించడం.. పవర్ ఫుల్ ఆఫీసర్ గా సుధీర్ బాబు…వాటికి తోడు మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఉగాదికి రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే కరోనా వల్ల సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయ‌ని తెలుస్తుంది. అంతేకాదు… క్లైమాక్స్‌ అయితే అదిరిపోతుందట. అయితే క్లైమాక్స్ సినిమా కు టేక్ ఆఫ్ అవుతుందట. అంటే ఈ సినిమా కథ ముగిసిన చోట నుండే కథను కొనసాగించవచ్చన్నమాట. దీనితోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందేమో అన్న సందేహాలు వస్తున్నాయి. మరి ఈ సినిమాకొచ్చే సక్సెస్ ను బట్టి సీక్వెల్ ప్లాన్ చేయాలా వద్దా అని డిసైడ్ చేయనున్నారు. చూద్దాం మరి ‘వి’ రిజల్ట్ ఎలా ఉంటుందో..

కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.