‘నిన్నుకోరి’ రీమేక్ కు సూపర్ క్రేజ్..!

Superb Craze For Ninnu Kori Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ninnu Kori,Ninnu Kori Movie,Ninnu Kori Telugu Movie Latest News,Ninnu Kori Movie Updates,Ninnu Kori Remake,Ninnu Kori Movie Remake,Ninnu Kori Telugu Movie Remake

అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు మనం పక్క సినిమాలను తెచ్చుకొని ఇక్కడ రీమేక్ చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు మన సినిమాలకు క్రేజ్ పెరిగింది. మన సినిమాలను రీమేక్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలను రీమేక్ చేయగా ఇప్పుడు మరో సినిమా రీమేక్ కోసం ఎగపడుతున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. నాని ‘నిన్నుకోరి’ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో 2017లో వచ్చిన ‘నిన్నుకోరి’ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నాని కెరియర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నానికి జోడిగా నివేదా థామస్ నటించగా.. తమిళ నటుడు ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా తమిళ్ రీమేక్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాని పాత్రలో అథర్వ మురళీ నటిస్తున్నాడు. నివేదా థామస్ ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

ఇక కన్నడ లో కూడా నిన్నుకోరి సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధృవ్ సర్జా కథానాయకుడిగా నటించనున్న ఆ సినిమాకు కన్నడ ప్రముఖ దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వం వహించనున్నాడు. రీసెంట్ గా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ లో కూడా కొంత మంది కుర్ర హీరోలు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు టాక్. ఫైనల్ గా ఎవరు చేస్తారో చూడాలి. మరి మన తెలుగు సినిమాలకు ఇంత క్రేజ్ రావడం నిజంగా ఆనందించాల్సిన విషయమే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − seven =