ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు ‘కపటధారి’ అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీకి సెన్సార్ కూడా పూర్తి కాగా సెన్సార్ బృందం ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తైన సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సుమంత్ తన కపటధారి సినిమాకు విడుదల తేదిని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా థియేటర్లో కపటధారి విడుదల కానుందని మూవీ యూనిట్ ప్రకటించింది.
#Kapatadhaari Censored U/A. Releasing this Christmas… in theatres! @Directorpradeep @Nanditasweta @vennelakishore@simonkking @bhashyasree@vamsikaka@CreativeEnt4 @adityamusic @Dhananjayang pic.twitter.com/I8rYM7rSGQ
— Sumanth (@iSumanth) November 24, 2020
కాగా ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.ధనంజయన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా… నాజర్, నందిత, పూజా కుమార్, వెన్నెల కిషోర్, జయప్రకాశ్, సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ వెర్షన్లో ఇతర నటీనటులు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన విజయవంతమై అర్జున్, విజయ్ ఆంటోని `కిల్లర్`చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నసైమన్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: