వలయం చిత్రం చూడడానికి 5 కారణాలు

Here are the 5 Reasons To Watch Valayam Movie

ఈ సినిమాకు కథే ప్రధాన హీరో అని చెప్పుకోవచ్చు. కథ విషయానికొస్తే అరవింద్ (లక్ష్), దిశా (దిగంగన) పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా ఆనందంగా సాగిపోతున్న అరవింద్ జీవితంలో భార్య దిశా కనిపించకుండాపోవడం కలకలం రేపుతుంది. అసలు దిశా ఏమైంది? తనకు తానే వెళ్లిపోయిందా? ఎవరైనా ఎత్తుకుపోయారా? దిశా మిస్సింగ్ మిస్టరీలో భర్త అరవింద్ పాత్ర ఏమైనా ఉందా? చివరకి దిశా దొరికిందా? లేదా? అనే సస్పెన్స్ విషయాలే ఈ చిత్ర కథ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కథ, ప్రేక్షకులు ఊహించలేని మలుపులు తిరుగుతుంటుంది. మిస్సింగ్ మిస్టరీ వీడింది అని అనుకునేలోపే మరో చిక్కుముడి వస్తుంది. అది విప్పేలోపే మరొకటి ఇలా సినిమా అంత ఒక సస్పెన్స్ తో వరుస ట్విస్ట్ లతో ఆద్యంతం చూసేవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నోయెలే హీరోయిన్ ను కిడ్నప్ చేసాడు అని అందరు ఫిక్స్ అవుతారు. కానీ అతను కాదు అని తెలిసే సన్నివేశం, హీరోయిన్ ని ఎవరు కిడ్నప్ చేశారు అని తెలిపే సన్నివేశాలు చాలా బాగుంటాయి.

2. అనురాగ్ కులకర్ణి ఆలపించిన నిన్ను చూశాకే పాట ఈ చిత్రానికి హైలైట్. వనమాలీ రాసిన ఈ పాట లోని లిరిక్స్ చాలా బాగున్నాయి.

3. పోలీస్ ఆఫీసర్ గా రవి ప్రకాష్ ఇరగదీసాడు. తన హావ భావాలతో పాత్రకు ప్రాణం పోసాడు. నోయెల్, కిరీటి ల నటన చాలా బాగుంటుంది. హీరోకు, నోయెల్ కి మధ్య జరిగే పోరాట సన్నివేశంలో నోయెల్ జీవించేసాడు.

4. సన్నివేశాల చిత్రీకరణ చాలా చక్కగా ఉంది. నటుల హావభావాలను పర్ఫెక్ట్ గ కాప్చర్ చేసాడు. నిన్ను చూశాకే పాట లో వచ్చే పెళ్లి సన్నివేశం మరియు ఊటీ అందాలను చాలా చక్కగా ప్రెసెంట్ చేశారు. పాటలో వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

5. హీరోయిన్ ను వెతకడం కోసం హీరో పడే తపన చాలా బాగుంటుంది. అతను చేసే రిస్క్ లు, కిడ్నపర్ ఎవరు అని తెలుసుకోడానికి అతను చేసే ప్రయత్నాలు ఉద్వేగంగా ఉంటాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.