బిగ్ బాస్ 4 – నిన్న హాట్ హాట్ గా నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఇంకా అదే హీట్ తో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ లోకి వెళ్లినందుకు అరియానా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానితో అవినాష్ ఏడవొద్దని ఏడిస్తే ఏం అవ్వదని కాస్త అసహనం వ్యక్తం చేసాడు. మరోవైపు మోనాల్ ఒంటరిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. కరెక్ట్ పర్సన్‌తో స్వాప్ చేయమని చెప్పింది అఖిల్ గురించి అని చెప్పడంతో షాకైన హారిక సారీ చెప్పింది. మరోవైపు ఒకరిని తొక్కి ముందుకు వెళ్లడం ఇష్టం లేదన్న అభి.. మోనాల్‌తో స్వాప్‌కు ఎలా ఒప్పుకున్నాడని అఖిల్ సోహెల్ తో అంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నామినేషన్ లో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. “ఎవిక్షన్ ఫ్రీ పాస్” ప్రవేశపెడుతూ నామినేట్ అయినవారు దాన్ని పొందేందుకు టాస్కు ఇచ్చాడు. హౌస్ లోపల పలు చోట్ల బిగ్ బాస్ జెండాలు పెట్టాడు. వాటిని ఎవరు కలెక్ట్ చేస్తారో వారు సెకండ్ లెవల్ కి వెళ్తారు. మొదటి లెవల్లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ పోటీపడగా అవినాష్, అఖిల్ ఎక్కువ జెండాలు సేకరించి రెండో లెవల్‌కు వెళ్లారు. ఈ లెవల్ లో ఎవరికి వారు క్యాంపైన్ చేసుకోవాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారికి ఫ్రీ పాస్ వస్తుంది. ఇందులో ‘బీబీ- కష్టానికే గెలుపు ‘అన్న పార్టీ పేరుతో అఖిల్, ‘గమ్యం చేరే వరకు’ పార్టీ పేరుతో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఎవరికి వారు వారికితోచినట్టు బాగానే హౌస్ మేట్స్ ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు అఖిల్, అవినాష్. ఇక ఈ ప్రాసెస్ లోఅవినాష్ మాట్లాడుతూ.. మీ ఇంటి మనిషే అనుకుని ఓటేయండి, ఫ్రెండ్స్ కాళ్లు పట్టుకుంటే బాగోదు కదా ప్లీజ్ ఓటేయండి అని మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తర్వాత అఖిల్.. నా గుర్తింపే బీబీ. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు చాలా అవసరం. ఒక్క ఓటు నా జీవితాన్ని మార్చేస్తుంది అని అభ్యర్థించాడు. కానీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మోనాల్, సోహైల్.. అఖిల్‌కు పూలమాల వేసి ఓటేయగా అరియానా, అభి.. అవినాష్‌కు ఓటేశారు. హారిక వేసే చివరి ఓటే కీలకం కాగా ఆమె అవినాష్‌కే సపోర్ట్ చేసింది. అతడికి రెండు వారాల పాటు ఉండే ఇమ్యూనిటీ దక్కింది. దీన్ని ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో అరియానాకు దెయ్యం విజువల్ చూపించి భయపెడతాడు బిగ్ బాస్. అది చూసిన అరియానా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. చూద్దాం మరి రేపు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: