‘స‌న్ ఆఫ్ ఇండియా’ – హెద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం

Mohan Babu New Movie Son Of India Kick starts Second Schedule

రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న దేశ‌భ‌క్తి క‌థా చిత్రం ‘స‌న్ ఆఫ్ ఇండియా. అందుకే ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో‌ మోహ‌న్‌బాబు ఈ సినిమాలో కనిపిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా తిరుప‌తిలో మొదటి షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసింది. అక్క‌డ కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఇక ఇప్పుడు తాజాగా మరో షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్ర‌ధాన తారాగ‌ణంపై అధిక భాగం స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించనున్నారట.

కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తుండగా…డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు స్వ‌యంగా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మరి మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సినిమాతో రాబోతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా కొల్లెక్షన్ కింగ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 17 =