ఆనందంలో షిర్లీ సేతియా

Actress Shirley Setia Enjoys Cloud 9 Moment

యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగశౌర్య కు జోడీగా సింగర్ , యాక్ట్రెస్ షిర్లీ సేతియా ఎంపిక అయ్యారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. హీరో నాగశౌర్య ప్రస్తుతం “#NS20 “, “వరుడు కావలెను ” మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న్యూజిలాండ్ కు చెందిన సింగర్ , “పైజామా పాప్ స్టార్” షిర్లీ సేతియా”మస్కా ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. షిర్లీ ప్రస్తుతం యాక్షన్ రొమాంటిక్ కామెడీ “నికమ్మా” హిందీ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. టాలీవుడ్ లో ఎంపిక అయినందుకు ఆనందంతో ఉన్న షిర్లీ మాట్లాడుతూ .. తనకు తెలుగు భాష తెలియదనీ , సౌత్ ఇండియన్ మూవీస్ ను సబ్ టైటిల్స్ తో వాచ్ చేస్తాననీ , సౌత్ ఫిల్మ్స్ తనను ఆకర్షించాయనీ , తెలుగు ఫిల్మ్ లో వర్క్ చేయడం అద్భుతం అనీ , లాక్ డౌన్ సమయం లో వీడియో కాల్ లో ఈ మూవీ స్క్రిప్ట్ విన్నాననీ, స్క్రిప్ట్ తనను ఇంప్రెస్ చేసిందనీ , తెలియని భాష (తెలుగు) లో నటించే అవకాశం రావడం ఆసక్తి తో పాటు చాలా ఆనందంగా ఉందనీ , షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 5 =