
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 90


టాలెంటెడ్ డైరెక్టర్‌తో వెంకీ సినిమా?

తేజ్-మారుతి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

నాన్ స్టాప్‌గా ‘గ్యాంగ్‌లీడర్’ షూటింగ్

‘మన్మథుడు 2’ టీమ్‌లో జాయిన్ అయిన కీర్తి సురేష్

అప్పుడు చిరు - ఇప్పుడు టాప్ డైరెక్టర్లు

కాజల్ అగర్వాల్ సమర్పణలో మను చరిత్ర మూవీ

100% తెలుగు మూవీ హిప్పీ

‘ప్రతి రోజూ పండగే’ అంటున్న సాయితేజ్ ?

‘వెంకీమామ’ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్

సెన్సార్ పూర్తి చేసుకున్న ఏబీసీడీ

సెన్సార్ పూర్తి చేసుకున్న `సీత`

మళ్లీ వాయిదా పడిన అయోగ్య

మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్

మహేష్ బాబు ఇంట మహర్షి వేడుక

సీత ట్రైలర్ రిలీజ్

జూలై నుంచి సెట్స్ పైకి ‘రాజుగారి గది 3’?
రాజుగారి గది సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘రాజుగారి గది’ (2015), ‘రాజుగారి గది 2’(2017) చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో… ఇప్పుడు ‘రాజుగారి గది 3’కి ప్లానింగ్ జరుగుతోందని టాలీవుడ్ టాక్.

టాలెంటెడ్ డైరెక్టర్‌తో వెంకీ సినిమా?
ఈ ఏడాది ఆరంభంలో ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలసి వెంకీ చేసిన అల్లరి ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం తన మేనల్లుడు యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలసి ‘వెంకీమామ’లో నటిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… వెంకీ ఇప్పుడు మరో మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

‘ఇస్మార్ట్ శంకర్’ -‘ఇస్పెషల్’ దుస్తులు-'ఇస్పెషల్ ప్రమోషన్స్'
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్.ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా కోసం ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. రామ్ ఫుల్ మాస్ లుక్ లో చూపించాడు పూరీ.

తేజ్-మారుతి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
వరుస పరాజయాల తరువాత చిత్రలహరి సినిమాతో కాస్త రిలాక్స్ అయ్యాడు సాయితేజ్. ఇక ఇదే జోష్ లో మరో సినిమా చేస్తున్నాడు తేజ్. మారుతి డైరెక్షన్ లో తేజ్ కొత్త సినిమా ఉండబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ల పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

నాన్ స్టాప్‌గా ‘గ్యాంగ్‌లీడర్’ షూటింగ్
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. వేర్వేరు ఏజ్ గ్రూప్‌లకి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో… ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

‘మన్మథుడు 2’ టీమ్‌లో జాయిన్ అయిన కీర్తి సురేష్
కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రలలో దర్శనమివ్వనున్నారు.

అప్పుడు చిరు - ఇప్పుడు టాప్ డైరెక్టర్లు
'ఎర్రసైన్యం', 'చీమల దండు', 'ఒరేయ్ రిక్షా', ఇలా సమాజంలోని తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ఎన్నో సినిమాలు చేసారు ఆర్ నారాయణ మూర్తి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నారాయణమూర్తి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.

అమ్మ ఔన్నత్య ఆవిష్కరణలో సిని'మా'దే అగ్రస్థానం
“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్నట్లుగానే సమాజంలోని అన్ని అనుబంధాలలోకి అన్ని విధాలా అత్యున్నతమైన అనుబంధం “అమ్మ” అన్నది నిర్వివాదాంశం.

కాజల్ అగర్వాల్ సమర్పణలో మను చరిత్ర మూవీ
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పించు మను చరిత్ర మూవీ ఈ రోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయింది. భరత్ కుమార్ Pదర్శకత్వం లో నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి, మేఘ ఆకాష్ జంటగా ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ ఫుల్ జాయ్ ట్యాగ్ లైన్ తో మను చరిత్ర మూవీ రూపొందుతుంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా మను చరిత్ర ను కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్, N శ్రీనివాస్ రెడ్డి తో కలసి నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ సమర్పిస్తున్నారు.

100% తెలుగు మూవీ హిప్పీ
V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో కార్తికేయ నటించిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. క్రేజీ కథానాయకుడు కార్తికేయ నటించిన హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు. దిగాంగన సూర్యవన్షి కథానాయిక. హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 9వ తేదీ రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’కి 7 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా… అనతికాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు పవన్. కథానాయకుడిగా కెరీర్ ఆరంభంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్… ఆ తర్వాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయాడు. ఖుషి తరువాత దాదాపు ఏడేళ్ళకి జల్సా రూపంలో ఘనవిజయాన్ని అందుకున్న పవన్… మరో నాలుగేళ్ళ తరువాత ‘గబ్బర్‌సింగ్’ రూపంలో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. “నాక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది” అంటూ పవన్ సృష్టించిన ప్రభంజనంతో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

‘ప్రతి రోజూ పండగే’ అంటున్న సాయితేజ్ ?
‘తాత మనవడు’ నుంచి ‘మా నాన్నకి పెళ్లి’ వరకు మూడు తరాల నేపథ్యంలో సాగే పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా రాబోతోందని సమాచారం.

‘వెంకీమామ’ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… తాజాగా హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఏబీసీడీ
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న `సీత`
యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రేక్షకుల నుండి ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది.

'అల్లరి' రవి టు 'మహర్షి' రవి
కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి. కొన్ని పాత్రలు అదృష్టం కొద్ది కలిసొస్తాయి. అలా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని.. ఆ పాత్రలను వాడుకున్న వారికి మంచి ప్రశంసలు దక్కుతాయి. ఒక్కోసారి అదృష్టం బాలేనప్పుడు ఆ పాత్రలను వదలుకొని బాధ పడిన హీరోలు, హీరోయిన్ లు.. కూడా చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు అలాాంటి పాత్రనే దక్కించుకొని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు అల్లరి నరేష్.

మళ్లీ వాయిదా పడిన అయోగ్య
పాపం కోలీవుడ్ స్టార్ విశాల్ అయోగ్య సినిమా రిలీజ్ కు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' సినిమా కు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే హిందీలో 'సింబా' పేరుతో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కానీ.. రిలీజ్ డేట్ మాత్రం కుదరట్లేదు. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. అది కుదరలేదు. ఆ తరువాత మళ్లీ మే 10 వ తేదీ అంటే ఈరోజుకి వాయిదా వేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఈరోజు కూడా ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమా…

మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా. సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈసినిమాలో మహేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. స్టూడెంట్ గా.. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా.. గ్రామానికి వచ్చిన తరువాత విలేజ్ గెటప్ లో ఇలా మూడు షెడ్స్ లో బాగా నటించాడు. ఇక ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ పాత్రలో చాలా బాగా నటించాడు. ఇక ప్రస్తుతం థియేటర్లలో పోటీకి సినిమాలు కూడా లేవు కాబట్టి కలెక్షన్లు కూడా బాగా రాబట్టే అవకాశం…

మహేష్ బాబు ఇంట మహర్షి వేడుక
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజయి హిట్ టాక్ తెచ్చుకుంది. హైప్ క్రియేట్ అయిన మహర్షి మూవీ పై సోషల్ మీడియా లో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ లోని సోషల్ మెసేజ్ ద్వారా ప్రేక్షక హృదయాలు గెలుచుకున్న మహేష్ బాబు మరోసారి మహర్షి మూవీ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సీత ట్రైలర్ రిలీజ్
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా… ఇంత వరకూ రిలీజ్ కాలేదు. అయితే ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మే 24న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'నా పేరు సీత .. నేను గీసిందే గీత' అనే ఒకే ఒక్క కాజల్ డైలాగ్ తో ఆమె పాత్ర స్వభావం ఎలాంటిదో చెప్పేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.