అమ్మ ఔన్నత్య ఆవిష్కరణలో సిని’మా’దే అగ్రస్థానం

Latest Telugu Movies News, Mother Sentiment Blockbuster Movies Of All Time, Mother Sentiment Movies In Tollywood, Mother Sentiment Oriented Movies In Telugu, Mother Sentiment Telugu Movies, Telugu Film News 2019, Telugu Filmnagar, The Greatness of Mother Through Films, The Mother Sentiment, Tollywood Cinema Updates, Top 10 Telugu Mother Sentiment Movies
The Greatness of Mother Through Films

“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్నట్లుగానే సమాజంలోని అన్ని అనుబంధాలలోకి అన్ని విధాలా అత్యున్నతమైన అనుబంధం “అమ్మ”
అన్నది నిర్వివాదాంశం. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఏ అనుబంధంలోనైనా అపార్ధాలకు, అనుమానాలకు తావుoటుందేమో కానీ అమ్మ ప్రేమలో, అమ్మ అనురాగంలో ఎలాంటి అపోహలకు అవకాశం ఉండదు. మన దైనందిన జీవితం ఎన్నెన్నో అనుబంధాలతో పెనవేసుకుపోయి ఉంటుంది. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, తాతా-మనవడు, బాబాయ్, మామయ్య, స్నేహితుడు… ఇలాంటి సమస్త అనుబంధాలలో సర్వోత్తమమైనది “అమ్మ” కాబట్టే
మన కావ్యాలలో, పురాణాలలో, చరిత్ర పుటల్లో, సమకాలీన సాహిత్యంలో , నాటకాల్లో, సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో “అమ్మ సెంటిమెంట్” దే అగ్రస్థానం అయ్యింది.

ఈరోజు “అంతర్జాతీయ మాతృ దినోత్సవ” నేపథ్యంలో మన తెలుగు సినిమాల్లో “అమ్మ సెంటిమెంట్” గురించి ఒకసారి సింహావలోకనం చేసుకుందాం.

ముందుగా సినిమా టైటిల్స్ లో “అమ్మ” ఉన్న సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

“అమ్మ మాట” – 
మహానటి సావిత్రి తల్లిగా, శోభన్ బాబు కొడుకుగా వి.రామచంద్రరావు దర్శకత్వంలో జీవీఎస్ రాజు   నిర్మించిన“అమ్మ మాట ” 1972లో విడుదలైంది.

“అమ్మ కోసం” – 
అంజలీదేవి అమ్మగా కృష్ణ- కృష్ణంరాజు కొడుకులుగా  అంజలీదేవి సమర్పణలో బి వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మితమైన “అమ్మ కోసం” 1970 లో విడుదలైంది.

“అమ్మ మనసు” –
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో జి వి ఎస్ రాజు నిర్మించిన “అమ్మ మనసు”లో చలం, జయంతి, భారతి, శుభ, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణం. ఈ సినిమా  1974 లో విడుదలైంది.

“అమ్మ ఎవరికైనా అమ్మ” – 
అంజలీదేవి తల్లిగా రజనీకాంత్ కొడుకుగా నటించిన ఈ చిత్రంలో శ్రీ ప్రియ, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, నాగభూషణం, నాగేష్, చలం తదితరులు ముఖ్య తారాగణం. త్యాగరాజన్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం 1979 లో విడుదలైంది.

“అమ్మ రాజీనామా” – 
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఊర్వశి శారద, సత్యనారాయణ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన “అమ్మ రాజీనామా” 1991లో విడుదలైంది.

“అమ్మ” – 
సుహాసిని – అశ్విని నాచప్ప ప్రధాన పాత్రల్లో కనిపించే “అమ్మ” చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ వారు 1991లో నిర్మించారు. సురేష్ కృష్ణ ఈ చిత్ర దర్శకుడు.

“అమ్మ కొడుకు” – 
డాక్టర్ రాజశేఖర్, ఆమని ప్రధాన పాత్రల్లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో ఇళయరాజా సంగీత సారధ్యంలో వడ్డే రమేష్ నిర్మించిన అమ్మ కొడుకు 1994 లో విడుదలైంది.

“అమ్మ చెప్పింది”-  
స్వీయ  దర్శకత్వంలో గుణ్ణం గంగరాజు నిర్మించిన ” అమ్మ చెప్పింది” చిత్రంలో సుహాసిని, శర్వానంద్ తల్లి కొడుకులుగా నటించారు. కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా 2006లో విడుదలైంది.

ఇవి “అమ్మ” టైటిల్ తో ” అమ్మ” సెంటిమెంట్ తో రూపొందిన సినిమాలు. రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా  ‘అమ్మ నాన్న’ అనే టైటిల్ తో ఒక సినిమా వచ్చినట్లుగా సమాచారం. కానీ పూర్తి వివరాలు అందుబాటులో లేవు.” అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి” అనే సినిమా టైటిల్లో అమ్మ ఉన్నప్పటికీ అది అమ్మ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిన సినిమా కాదు.

ఇక మన తెలుగు సినిమాల్లో అమ్మ మీద వచ్చిన కమ్మనైన పాటలు అమ్మ ఔన్నత్యాన్ని ఆకాశమంత ఎత్తులో ఆవిష్కరించాయి.
వాటిలో కొన్ని: 

*  20వ శతాబ్దం”  చిత్రం కోసం డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన 
” అమ్మను మించి దైవమున్నదా- ఆత్మను మించి అద్దమున్నదా –
జగమే పలికే శాశ్వత సత్యమిది-” 
అనే పల్లవితో సాగే పాట అమ్మ పాటల్లో ఆల్ టైం హిట్ గా నిలుస్తుంది.

* “బుల్లెమ్మ బుల్లోడు”- చిత్రంలో 
“అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట”- అన్న పాట అమ్మ పాటల్లో
మరొక టాప్ సాంగ్.

* “రామబాణం” చిత్రంలో 
”  అమ్మా   ప్రేమకు మారుపేరు
అమ్మ మనసు పూల తేరు”
అన్నది కూడా అమ్మ మీద వచ్చిన ఒక అద్భుత  గీతం.

* అమ్మ అమ్మ అని పిలిచావు 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు.
ఇది ” విచిత్రబంధం” చిత్రంలోని ఒక కమ్మనైన అమ్మ పాట.

*  అమ్మ మీద వచ్చిన అద్భుత గీతాలలో” మంచి మనసుకు మంచి రోజులు” చిత్రంలోని ఒక పాటను గుర్తించుకోవాలి.
“ధరణికి గిరి భారమా
గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా
కని పెంచే తల్లికి పిల్ల భారమా” 
సి.ఎస్.రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలో పై పాటలో  ప్రముఖ నటి జయచిత్ర తల్లి జయశ్రీ నటించారు.

* “ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం”- అనే పల్లవితో సీతారామ శాస్త్రి కలం నుండి జాలువారిన అమ్మతనాన్ని “అమ్మ రాజీనామా” చిత్రం కోసం దాసరి నారాయణరావు అద్భుతంగా చిత్రీకరించారు.

* సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ”- ఇదే “అమ్మ రాజీనామా” చిత్రం కోసం నారాయణ రెడ్డి కలం నుండి జాలువారిన అద్భుత సృష్టి ఈ గీతం.

* ఇవే కాకుండా రైతు కుటుంబం, దసరా బుల్లోడు, కలిసొచ్చిన అదృష్టం, జీవనజ్యోతి, మాతృదేవత వంటి అనేకానేక చిత్రాలలోని అమ్మ పాటలు
అమృత గుళికల్లా మాతృత్వ మాధుర్యానికి అద్దం పట్టాయి.

* ఇక వయసు ఉన్మాదంలో తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేసి ఆ తరువాత తప్పు తెలుసుకుని పరివర్తన చెందిన తరువాత అమ్మ ప్రేమ కోసం అలమటిస్తూ, ఆక్రోశిస్తూ కొడుకు పాడే పశ్చాత్తాప గీతం ఏది అంటే అందరి మదిలో మెదిలే
అజరామర గీతం “పాండురంగ మహత్యం” – చిత్రంలోని
” అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు 
ఈ జన్మకు లేదా 

పదినెలలు నను మోసి
పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో
ఊడిగాలు చేసినా
ఓ తల్లి నిను నలుగురిలో
నగుబాటు చేసితి
తలచకమ్మ తనయుని
తప్పులు క్షమించుమమ్మ ” 
అంటూ పశ్చాత్తాపంతో కరిగిపోతూ
తల్లి పాదాల పై వాలిపోయే ఆ కరుణరసాత్మక దృశ్యం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోదు.

ఈ విధంగా  ఇంకా ఎన్నో చిత్రాలలో
అమ్మ ప్రేమానురాగాలను,ఔన్నత్య , ఔదార్యాలను అద్భుతంగా ఆవిష్కరించారు మన నటీనటులు రచయితలు, దర్శకులు, నిర్మాతలు.

ఒక్క అమ్మ అనురాగ ఆవిష్కరణ లోనే కాదు…  సమస్త మానవ సంబంధాలను , మానవతా విలువలను, మానవీయ కోణాలను అద్భుతంగా , అర్థవంతంగా ఆవిష్కరించే గొప్ప చైతన్య సాధనం
సినిమా. 
ఈ సాధనంలో భాగమైనందుకు
ఆనందిస్తూ, గర్విస్తూ  అందరికీ
మాతృ దినోత్సవ శుభాభినందనలు పలుకుతుంది మీ ”
దితెలుగుఫిలింనగర్.కామ్”.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =