ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 56
లండన్ కూడా భళా 'బాహుబలి'

మెగాస్టార్ తో సినిమా ప్లాన్..!

తుఫాను బాధితులకు 'తలైవా' సాయం

సెన్సార్ పూర్తి చేసుకున్న 'హల్ చల్'
మిస్ ఇండియా మూవీ కై 50 లుక్ టెస్ట్స్

'ఖైదీ'- స్టైలీష్ మాస్‌యాక్షన్ థ్రిల్లర్
అల .. వైకుంఠ పురములో .. మూవీ లో స్లిమ్ లుక్
ట్రాక్ లో పడుతున్న "హీరో "
అసురన్ మూవీ టీమ్ కు అభినందనలు
పూరిలో ‘ఉప్పెన’

వెంకటేష్ చిత్రంలో బాలీవుడ్ నటుడు?

హిందీకి వెళుతున్న ‘భాగమతి’?

‘A 1’ గా నితిన్?
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తన సినిమాలతో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేసే వర్మ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ జి వి దర్శకత్వంలో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక అయన సినిమా అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘బాబు చంపేస్తాడు’ అనే మూడో పాటతో వివాదాస్పదమైన పదాలతో మరోసారి వర్మ వివాదానికే తెరతీశాడు.
లండన్ కూడా భళా 'బాహుబలి'
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.

మెగాస్టార్ తో సినిమా ప్లాన్..!
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ వంగ బాలీవుడ్ లో కూడా 'కబీర్ సింగ్' రీమేక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. షాహిద్ కపూర్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ రీమేక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా.. సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. సందీప్ వంగ రీమేక్ చేస్తేనే తాను నటిస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటే.. సందీప్ పై ఎంత నమ్మకం ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ లోనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. కబీర్ సింగ్ నిర్మాతలు అయిన టీ సీరిస్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తుఫాను బాధితులకు 'తలైవా' సాయం
తమిళ తంబీలపై తనకున్న ప్రేమను మరోసారి చూపించారు సూపర్ స్టార్ రజినీకాంత్. తుఫాను బాధితులకు మరిసారి ఆపన్న హస్తం అందించారు.. అసలుసంగతేంటంటే... తమిళనాడులో తుఫాను కారణంగా చాలా మంది తమ ఇళ్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రజినీకాంత్ నాగపట్నానికి చెందిన పది కుటుంబాలకు ఇళ్లను ఇవ్వడం జరిగింది. అంతేకాదు వారిని తమ ఇంటికి పిలిపించి.. ఇంటికి సంబంధించిన పాత్రలను వాళ్లకు ఇచ్చి తమ ఉదార స్వభావాన్ని చూపించారు. దీనితో రజినీపై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి రజినీ ఇలా చేయడం మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో చేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'హల్ చల్'
శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్ఉత్కమ్ ,ధన్య బాలకృష్ణన్ జంటగా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ హల్ చల్. ఈ సినిమా ద్వారా శ్రీపతి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం గా ఉంది.. సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది ఈ చిత్రం.

'డిస్కో రాజా' బాలు పాడిన పాటకు సూపర్ రెస్పాన్స్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే మొన్న ఈ సినిమా నుండి మొదటి పాటని రిలీజ్ చేశారు.
మిస్ ఇండియా మూవీ కై 50 లుక్ టెస్ట్స్
లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో కీర్తి సురేష్ అద్భుతంగా పర్ ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొంది , ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకొన్న విషయం తెలిసిందే. మహానటి మూవీ తరువాత కీర్తి సురేష్ కు ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్స్ వెల్లువెత్తాయి. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్న కీర్తి సురేష్ మిస్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో నవీన్ చంద్ర, జగపతి బాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.థమన్ Sసంగీతం అందించారు

'ఖైదీ'- స్టైలీష్ మాస్‌యాక్షన్ థ్రిల్లర్
'మా నగరం' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ను ఏర్పాటు చేశారు.
అల .. వైకుంఠ పురములో .. మూవీ లో స్లిమ్ లుక్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠ పురములో .. మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ టబు, నివేత పేతురాజ్, సుశాంత్ , జయరామ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ S సంగీతం అందించారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి, S/O సత్యమూర్తి మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల .. వైకుంఠ పురములో .. మూవీ హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది.
ట్రాక్ లో పడుతున్న "హీరో "
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వం లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడి గా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా హీరో మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కుతుంది. హీరో మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ నవంబర్ లో ప్రారంభం కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ ముగింపు దశ లో ఉంది. నవంబర్ నెలలో విజయ్ హీరో మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
మహానటుడు యన్టీఆర్ కెరీర్‌లో మరో మెమరబుల్ డేట్
ఒకే తేదిని టార్గెట్ చేసుకుంటూ... వేర్వేరు సంవత్సరాల్లో మూడు లేదా నాలుగు సినిమాలతో సందడి చేసిన వైనాలు మహానటుడు నందమూరి తారక రామారావు కెరీర్‌లో చాలానే ఉన్నాయి. అలాంటి తేదీల్లో అక్టోబర్ 21 ఒకటి. వేర్వేరు సంవత్సరాల్లో ఇదే రోజున యన్టీఆర్ నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా... వాటిలో మూడు సినిమాలు మంచి విజయం సాధించడమే కాకుండా నటుడిగా తనకి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఆ చిత్రాలే... `జయసింహ’ (1955), `కోడలు దిద్దిన కాపురం`(1970), `యమగోల’(1977), `శ్రీనాథ కవి సార్వభౌముడు`(1993). వీటిలో `శ్రీనాథ కవి సార్వభౌముడు`ని మినహాయిస్తే... మిగిలిన మూడు సినిమాలు విజయకేతనం ఎగురవేయడమే…
రవితేజ - థమన్ కాంబినేషన్... `పదేళ్ళు - పది చిత్రాలు`
జయాపజయాలకు అతీతంగా సాగుతూ ప్రేక్షకులను అలరించే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి ఆసక్తికరమైన కలయికల్లో మాస్ మహారాజా రవితేజ, యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.థమన్‌ది ఒకటి. పలు మ్యూజికల్ హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ఈ కాంబినేషన్... ఈ ఏడాదితో పదేళ్లను పూర్తి చేసుకోవడమే కాకుండా పది చిత్రాల ప్రయాణాన్ని కూడా పూర్తి చేసుకుంటోంది.
అసురన్ మూవీ టీమ్ కు అభినందనలు
వి క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్ దర్శకత్వం లో ధనుష్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా అసురన్ తమిళ మూవీ అక్టోబర్ 4వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్ లో రూపొందిన పొల్లాదవన్, ఆడుకాలం, వడ చెన్నై మూవీస్ ఘనవిజయం సాధించాయ. ఆడుకాలం మూవీ లో ధనుష్ అద్భుతంగా పర్ ఫార్మ్ చేసి ఉత్తమ నటుడిగా నేహనల్ అవార్డ్ అందుకొన్నారు. దసరా కానుకగా రిలీజయిన అసురన్ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం.
పూరిలో ‘ఉప్పెన’
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం `ఉప్పెన`. ఇందులో వైష్ణవ్‌కు జోడిగా కృతి శెట్టి నటిస్తుండగా... కీలక పాత్రలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.
`రంగమ్మ మంగమ్మ` ఖాతాలో మరో రికార్డు
గత ఏడాది సంచలనం `రంగస్థలం` చిత్రంలోని “రంగమ్మ మంగమ్మ” పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్, సమంతపై చిత్రీకరించిన ఈ గీతం థియేటర్లలో మాస్‌ని ఉర్రూతలూగించింది. కేవలం థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నిరుడు సామ్ పుట్టినరోజు (ఏప్రిల్ 28) సందర్భంగా ఈ పాటని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా... తాజాగా 200 మిలియన్ల (20 కోట్ల) వ్యూస్‌ని క్రాస్ చేసింది `రంగమ్మ మంగమ్మ`. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, ఎం.ఎం.మానసి గానం, రత్నవేలు ఛాయాగ్రహణం, ప్రేమ్ రక్షిత్ నృత్యదర్శకత్వం... అన్నింటికి మించి చరణ్…

వెంకటేష్ చిత్రంలో బాలీవుడ్ నటుడు?
‘విక్టరీ’ వెంకటేష్, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `హార్స్ క్లబ్` బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్... ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఇందులో ఓ శక్తిమంతమైన పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీని ఎంపిక చేసే దిశగా తరుణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హిందీకి వెళుతున్న ‘భాగమతి’?
‘భాగమతి’… గత ఏడాది తెలుగునాట కాసుల వర్షం కురిపించిన థ్రిల్లర్ మూవీ. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ను జి.అశోక్ డైరెక్ట్ చేశాడు. కాగా, ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్ట్‌ను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

‘A 1’ గా నితిన్?
యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైండ్ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘చదరంగం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం... ఇప్పుడు ‘A 1’ అనే టైటిల్ వైపు యూనిట్ మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ రెండింట్లో ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
బాలీవుడ్ లో సౌత్ డైరెక్టర్ల హవా
మొత్తానికి మన సౌత్ డైరెక్టర్ల హవా బాలీవుడ్ లో బాగానే నడుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మన వాళ్లు చాలా కష్టపడేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ళే మన వాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు దాదాపు డజనుకుపైగా డైరెక్టర్లు బాలీవుడ్ హీరో లని డైరెక్ట్ చేస్తున్నారు. అది కూడా బాలీవుడ్ సూపర్ స్టార్లనే. మరి వారెవరో ఒకసారి చూద్దామా..
‘సామజవరగమన’ తెలుగు సినీ చరిత్రలో మొదటి పాట ఇదే
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ అంత ఇంత సెన్సేషన్ క్రియేట్ చెయ్యట్లేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా...ఇటీవల వచ్చిన పాటలలో ఈ పాట మ్యూజిక్ లవర్స్ కి తెగ నచ్చేసింది.