‘ఆర్.ఆర్.ఆర్’ – కొమరం భీమ్ లుక్ వచ్చేనా…!

NTR First Look from RRR on Komaram Bheem Birth Anniversary,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,NTR First Look from RRR,Komaram Bheem Birth Anniversary,NTR First Look,RRR Movie Updates

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి చాలా కాలంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు కొమరం భీమ్ జయంతి సందర్భంగా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చారు. ” స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ధీరుడు కొమరం భీమ్… ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం.. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ ను యంగ్ భీమ్ గా వెండితెరపై చూపించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం” అని అన్నారు. దీనితో ఈ సినిమా నుండి కొమరం భీమ్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేయొచ్చేమో అన్న వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం ఈ రోజు రిలీజ్ చేస్తారో.?లేదో..?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఎన్టీఆర్ హీరోయిన్ కోసం చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =