ఆరు సినిమాల‌తో దీపావ‌ళి సంద‌డి

6 Movies To Release For Diwali,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,6 Telugu Movies Release For Diwali,6 Films Releasing Around Diwali,Diwali Releases Telugu Movies

తెలుగునాట సంక్రాంతి, దసరా తరువాత ప్రత్యేకంగా జరుపుకునే పండగ దీపావళి. అలాంటి ఈ పండ‌గ సీజ‌న్‌లో మంచి క్రేజ్ ఉన్న తెలుగు చిత్రాలు విడుద‌లైతే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. అయితే, ఈ ఏడాది దీపావళికి అలాంటి వాతావ‌ర‌ణం లేక‌పోయినా… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆరు చిత్రాలు సంద‌డి చేయ‌బోతుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ అర‌డ‌జ‌ను సినిమాల్లో ఒకటి తెలుగు పిక్చ‌ర్ కాగా… రెండు త‌మిళ అనువాద చిత్రాలు, మూడు హిందీ ఫిల్మ్స్ ఉండ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… కామెడీ యాక్టర్ బిత్తిరి సత్తి తొలిసారి హీరోగా నటించిన ‘తుపాకి రాముడు’ దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా… కోలీవుడ్ స్టార్ విజయ్ తమిళ చిత్రం ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’ పేరుతో అదే రోజున విడుదల కానుంది. అలాగే… మరో తమిళ క‌థానాయ‌కుడు కార్తి నటించిన ‘ఖైదీ’ కూడా అక్టోబ‌ర్ 25నే తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.

మరోవైపు… అక్టోబర్ 25నే టార్గెట్ చేస్తూ ‘హౌస్‌ఫుల్ 4’ (అక్ష‌య్ కుమార్‌, పూజా హెగ్డే, కృతి స‌నన్‌, కృతి క‌ర్బందా ప్ర‌ధాన తారాగ‌ణం), ‘మేడ్ ఇన్ చైనా’ (రాజ్ కుమార్ రావ్), ‘సాండ్ కి ఆంఖ్’ (తాప్సీ, భూమి ఫెడ్నేక‌ర్) వంటి హిందీ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నాయి.

మరి… వీటిలో ఏ యే చిత్రాలకు ప్రేక్షకాదరణ దక్కుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =