‘ఆదిత్య వర్మ’ ట్రైలర్ రిలీజ్

మొత్తానికి ‘అర్జునరెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ అన్ని పనులు త్వరగా ముగించుకొని రిలీజ్ కు సిద్ధపడుతుంది. మొదటినుండి ఈ సినిమాకు కాస్త ఇబ్బందులు ఎదురైనా.. విక్రమ్ మాత్రం పట్టుపట్టి ఈ సినిమాను ఫైనల్ గా రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. కొడుకు ధృవ్ కంటే కూడా విక్రమ్ కే సినిమా ఎలా ఉంటుందో అని ఎక్కువ హార్ట్ బీట్ పెరిగిపోతుందట. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ నురిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి బానిత సంధు నటిస్తోంది. అర్జున్ రెడ్డి లో జియా శర్మ పాత్రలో హీరోయిన్ ప్రియా ఆనంద్ నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డికి సంగీతం అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హిందీ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి తెలుగు, హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. మరి దృవ్ అదృష్టం ఎలా ఉందో చూద్దాం…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.