నెల‌కో `మెగా` టైటిల్ మూవీ సంద‌డి

Mega Titles For Latest Telugu Movies,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Mega Hero Titles For Latest Telugu Movies,Mega Heroes Latest Telugu Movies,Latest Telugu Movies 2019 Updates

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ తాలూకు టైటిల్స్‌తో యువ క‌థానాయ‌కుల చిత్రాలు రావ‌డం కొత్తేమీ కాదు. అయితే… ఒకే క్యాలెండరు ఇయర్‌లో వ‌రుస‌గా మూడు నెలల పాటు `చిరు` టైటిల్స్‌తో సినిమాలు విడుదల కావడం మాత్రం క‌చ్చితంగా వార్త‌ల్లో నిల‌చే అంశ‌మే. అలా… 2019 ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌లు మెగా టైటిల్స్‌తో ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త వివరాల్లోకి వెళితే… చిరు కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్‌బస్టర్ మూవీస్ గా నిల‌చిన‌ ‘రాక్షసుడు’(1986) పేరుతో రూపొందిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘రాక్షసుడు’ ఈ ఏడాది ఆగస్టు 2న‌ విడుద‌ల కాగా… మెగాస్టార్‌ మ‌రో బ్లాక్‌బస్టర్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’(1991) టైటిల్‌తో తెరకెక్కిన నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక… చిరు కెరీర్‌ను మ‌లుపు తిప్పిన ‘ఖైదీ’(1983) చిత్రం టైటిల్‌తో… కోలీవుడ్ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ తమిళ, తెలుగు భాష‌ల్లో ఈ నెల (అక్టోబ‌ర్‌) 25న రిలీజ్‌ కానుంది. మొత్తానికి… మూడు వ‌రుస నెల‌ల్లో చిరు టైటిల్స్‌తో సినిమాలు రావడం విశేష‌మ‌నే చెప్పాలి.

మ‌రి… ఇప్పటికే చిరు పాత టైటిల్స్‌తో తెర‌కెక్కిన కొత్త చిత్రాలు ‘రాక్షసుడు’, ‘గ్యాంగ్ లీడర్’ సక్సెస్‌ను సొంతం చేసుకోగా… కార్తి ‘ఖైదీ’ కూడా అదే బాట ప‌డుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =