సెన్సార్ పూర్తిచేసుకున్న `ఖైదీ`

Karthi Khaidi Clears Censor Scrutiny,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Khaidi Movie Completes Censor Formalities,Karthi Khaidi Clears Censor,Karthi New Movie Khaidi,Khaidi Movie Latest News

కార్తి క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ‌ చిత్రం `ఖైదీ`. రా- యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా… తెలుగులోనూ అదే పేరుతో అనువాదం కానుంది. ఇందులో యావ‌జ్జీవ ఖైదీ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు కార్తి. ప‌దేళ్ళుగా జైలుశిక్ష అనుభ‌విస్తున్న దిల్లీ అనే ఓ ఖైదీ… త‌న ప‌దేళ్ళ కూతురిని చూడ‌డం కోసం ఓ రోజు రాత్రి చెర‌సాల నుంచి త‌ప్పించుకుంటాడు. ఈ నేప‌థ్యంలో… దిల్లీకి ఎదురైన అనుభ‌వాలేంటి? అనే అంశంతో `ఖైదీ` తెర‌కెక్కింది. నాలుగు గంట‌ల్లో చోటుచేసుకున్న పరిణామాల చుట్టూ అల్లుకున్న ఈ క‌థ‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు తండ్రీకూతుళ్ళ అనుబంధానికి కూడా పెద్ద పీట వేశాడు ద‌ర్శ‌కుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా `ఖైదీ`కి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. అలాగే… ఈ సినిమా 146 నిమిషాల 23 సెకండ్ల (2 గంట‌ల 26 నిమిషాల 23 సెకండ్ల‌) నిడివితో థియేట‌ర్ల‌లోకి రానుంది. సామ్ సి.ఎస్. సంగీత‌మందించిన `ఖైదీ`… దీపావ‌ళి కానుక‌గా ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.