అన్నాచెల్లెళ్ళ అనురాగానికి నిలువెత్తు నిదర్శనం ‘రక్తసంబంధం’ కు 57 ఏళ్ళు

NTR Evergreen Hit Movie Raktha Sambandham Completes 57 Years,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Raktha Sambandham Movie Completes 57 Years,57 Years for Raktha Sambandham Movie,NTR Evergreen Hit Movies

తోడబుట్టిన చెల్లెలి సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే ఓ అన్నయ్య కథే ‘రక్తసంబంధం’ చిత్రం. అన్నాచెల్లెళ్ళ ప్రేమకు అపు`రూప`కల్పనగా రూపొందిన ఈ చిత్రరాజంలో అన్నయ్యగా మహానటుడు యన్.టి.రామారావు, చెల్లెలుగా మహానటి సావిత్రి ఆ యా పాత్ర‌ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేశారు. తమిళ చిత్రం ‘పాశ‌మలర్’(1961)కి రీమేక్‌గా దిగ్గజ దర్శకులు వి.మధుసూదనరావు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కాంతారావు, దేవిక, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రాన్ని రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై డూండీ, సుందర్‌లాల్ నెహెతా సంయుక్తంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అనిశెట్టి సుబ్బారావు గీత రచన చేయగా… దిగ్గజ స్వరకర్త, గాయకులు ఘంటసాల వీనులవిందైన బాణీలు అందించారు. ముఖ్యంగా “చందురుని మించు అందమొలికించు”, “బంగారు బొమ్మ రావేమి” పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటితో పాటు “మంచిరోజు వస్తుంది”, “ఎవరో నన్ను కవ్వించి”, “ఆకాశమేలే అందాల రాజే”, “ఓహో వయ్యారి వదిన”, “అల్లారు ముద్దుగా”, “ఇదే రక్తసంబంధం” వంటి గీతాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. 1962 నవంబర్ 1న విడుదలై ఘనవిజయం సాధించిన‌ ‘రక్తసంబంధం’… నేటితో 57 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 17 =