తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో రాజకీయ నాయకుడి బయోపిక్ తెరకెక్కబోతుంది. ఇంతకు ఆ రాజకీయనాయకుడు ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాలూ ప్రసాద్ జీవితంపై సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట చిత్ర దర్శక.. నిర్మాతలు. లాలూ పార్టీ ఆర్జేడీ గుర్తు లాంతరు కావడంతో ఆయన సినిమాకి లాంతరు( లాల్‌టెన్) అనే పేరు పెట్టినట్టు సమాచారం. ప్రముఖ భోజ్‌పురి నటుడు యశ్ కుమార్ ..లాలూ పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు లాలూ సతీమణి రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనుండట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. మరి ఈ బయోపిక్ పై మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























