ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది – రజనీకాంత్

Superstar Rajinikanth Wishes To Act In A Transgender Role

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “దర్బార్ ” మూవీ తెలుగు, తమిళ భాషలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. “దర్బార్ ” మూవీ ట్రైలర్ సందర్భంగా మీడియా సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ .. 45 సంవత్సరాలుగా 160 కి పైగా మూవీస్ లో నటించానని, అన్ని జానర్ లలోనూ అనేక పాత్రలలో నటించానని, ఇక నటించాల్సిన పాత్రలు ఏమున్నాయా అని ఆలోచించగా ట్రాన్స్ జెండర్ పాత్ర మిగిలిపోయిందని , ఆ పాత్రలో నటించాలని ఉందని రజనీకాంత్ అన్నారు. ట్రాన్స్ జెండర్ పాత్రను పోషించమని ఎవరైనా సంప్రదించారా అని మీడియా అడిగిన ప్రశ్నకు , ఎవరూ సంప్రదించలేదని , ఆ పాత్రను పోషించాలనే ఆసక్తి ఉందని ఇప్పుడే అనౌన్స్ చేశానని రజనీకాంత్ జవాబిచ్చారు. మరాఠీ మూలాలు ఉన్న రజనీకాంత్ కు మరాఠీ మూవీ లో నటించాలని ఉందని, ఇంటిలో మరాఠీ భాషను మాట్లాడుతానని, ఒకసారి మరాఠీ మూవీ లో నటించే అవకాశం వచ్చినా వర్కవుట్ కాలేదని రజనీకాంత్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + seven =