`సుప్రీమ్` తరువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్, అందాల తార రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం `ప్రతి రోజూ పండగే`. సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి మారుతి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఎ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా `ప్రతి రోజూ పండగే`కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి క్లీన్ `యు` సర్టిఫికేట్ జారీ చేసింది. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సాయితేజ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి మరి.
థమన్ సంగీతసారథ్యంలో రూపొందిన `ప్రతి రోజూ పండగే` డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























