అజిత్ కి జోడీగా ఇలియానా?

Ileana To Pair Up With Thala Ajith,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Ileana Latest News,Actress Ileana New Movie News,Heroine Ileana Next Film Updates,Ileana Upcoming Movie News,Ileana Next Film Updates,Ileana Next Project Details

పుష్కర కాలం క్రితం తెలుగునాట సంచ‌ల‌నం సృష్టించిన అందం… ఇలియానా. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ… మాస్ మ‌హారాజా ర‌వితేజ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని`తో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా… త‌న న‌ట‌న‌తో, సొంత గొంతుతో మురిపించింది ఇలియానా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `న‌న్బ‌న్`(స్నేహితుడు) త‌రువాత కోలీవుడ్ కి దూర‌మైన ఇలియానా… త్వ‌ర‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో అక్క‌డ రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ అజిత్ క‌థానాయ‌కుడిగా `ఖాకి` ద‌ర్శ‌కుడు హెచ్. వినోద్ `వ‌లిమై` పేరుతో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ కి జోడీగా ఇలియానా న‌టిస్తోంద‌ని టాక్. అయితే, ఇలియానా ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.