2019… నాగ‌చైత‌న్య‌కి వెరీ వెరీ స్పెష‌ల్

2019 Turn Out To Be A Very Very Special Year For Naga Chaitanya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,2019 Special For Naga Chaitanya,Naga Chaitanya About 2019 Special Year,2019 Very Special Year For Naga Chaitanya

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌కి 2019 సంవ‌త్స‌రం భ‌లేగా క‌లిసొచ్చింది. `రారండోయ్ వేడుక చూద్దాం` (2017) త‌రువాత స‌రైన విజ‌యం లేని చైతూకి… ఈ ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందాయి. అలాగే, ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో ఈ అక్కినేని థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ హీరో రెండు వ‌రుస విజ‌యాలు చూడ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ రెండు చిత్రాలు కూడా ఒకే ఫార్ములా ప్ర‌కారం న‌డిచాయి. ఇంత‌కీ ఆ ఫార్ములా ఏంటంటే… రియ‌ల్ లైఫ్ రిలేష‌న్ షిప్ నే రీల్ లైఫ్ రిలేష‌న్ షిప్ గానూ చూపించ‌డం. నిజ‌జీవితంలో భార్యాభ‌ర్త‌లైన చైతూ, స‌మంత `మ‌జిలీ` కోసం అదే త‌ర‌హా పాత్ర‌ల్లో క‌నిపించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొడితే… `వెంకి మామ‌`లో రియ‌ల్ లైఫ్ మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన విక్ట‌రీ వెంక‌టేష్, చైతూ రీల్ లైఫ్ లోనూ అదే బంధంతో అల‌రించి ఘ‌న‌విజ‌యాన్ని అందుకోవ‌డం విశేషం.

మొత్తంగా… 2019 సంవ‌త్స‌రం చైతూకి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందివ్వ‌డ‌మే కాకుండా… `సేమ్ రిలేష‌న్ షిప్`ని స్క్రీన్ పైనా ఆవిష్క‌రించిన రెండు లైఫ్ టైమ్ `మెమ‌రీస్`ని ఇచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =