
ట్యాగ్ · 109 కథనాలు


గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం

ఫాదర్స్ డే .. క్లీంకారతో రామ్ చరణ్, పిక్ వైరల్

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ చరణ్

హాలీవుడ్ లో చరణ్ క్రేజ్

చరణ్ కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్

తండ్రి కలను నిజం చేసిన చరణ్

రామ్ చరణ్, ఉపాసన బేబి షవర్ సెల్రబేషన్స్

RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

బలగం మూవీపై చరణ్ ప్రశంసలు

ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసనరామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల వారి జీవితంలో మరో అందమైన అధ్యాయాన్ని ఆరంభించారు. ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. త్వరలో ట్విన్స్‌కు (కవలలు) జన్మనివ్వనున్నారు. ఒక క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన ఉపాసన.. ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెసింగ్స్‌తో ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఈ గుడ్‌న్యూస్‌ను షేర్ చేశారు.

రామ్ చరణ్ సినీప్రస్థానానికి 18 ఏళ్లు.. 'పెద్ది' నుంచి మాస్ పోస్టర్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీప్రస్థానంలో 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంలో తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే "పెద్ది"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో వుండబోతోంది.

గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
నటనలోనే కాదు.. మనసులోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హార్ట్ ఇష్యూ (పల్మనరీ హైపర్‌టెన్షన్) జన్మించిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పాప పాలిట ప్రాణదాతగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఒక ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో ఒక చిన్నారి జన్మించింది. అయితే ఆ పాప గుండెల్లో ఏదో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు.

రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటన పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటలో సహనటుడు జూ. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్‌గా సెన్సేషనే సృష్టించాయి. ఈ పాట ఒరిజినల్ బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది.

ఫాదర్స్ డే .. క్లీంకారతో రామ్ చరణ్, పిక్ వైరల్
ఫాదర్స్ డే సందర్భంగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గారాల పట్టి క్లీంకారతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముద్దుల తనయ క్లీంకారను ఎత్తుకుని గాల్లోకి ఎగరేస్తూ ఆడిస్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. కాగా రామ్ చరణ్, క్లీంకార ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివరీతంగా షేర్స్ చేస్తూ లైక్స్ కొడుతూ తమ పేవరెట్ హీరోపై ఓ రేంజ్‌లో అభిమానం చూపిస్తున్నారు.

రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోంది - రామ్ చరణ్
రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోందని, ఆయన ఇంకా యంగ్‌గా మారుతున్నారని పేర్కొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆయనతో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి తనయుడిగా జన్మించడం తన అదృష్టమన్న ఆయన చిత్ర పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు.

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆతర్వాత కూడా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. ఇక రంగస్థలంతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఆసినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ స్థాయిలో రామ్ చరణ్ క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఇక్కడ మాత్రమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం అందుకున్నాడు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో రామ్ చరణ్ దంపతులు.. మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా సతీమణి ఉపాసనతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రామ్ చరణ్, ఉపాసనలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చరణ్ దంపతులు కుమార్తె క్లీన్ కారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

హాలీవుడ్ లో చరణ్ క్రేజ్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ కు హాలీవుడ్ లో కూడా క్రేజ్ బాగానే పెరిగిందన్న సంగతి తెలిసిందే. అక్కడ అవార్డులను సైతం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి చరణ్ క్రేజ్ అక్కడ ఎలా ఉంది రుజువైంది. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రకటన ఇచ్చారు మేకర్స. ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ఒక పాత్ర కోసం నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక ఆ పాత్ర ఎలా ఉండాలో తెలియజేయడం కోసం కొన్ని పాత్రలను ఉదాహరణగా చూపించింది. అలా ఒక ఆరు పాత్రలని ఆ ప్రకటనలో ఇచ్చారు. ఆ పాత్రల్లో ఒకటి.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ కాప్ రోల్. వాటిలో ఉన్న మిగిలిన ఐదు పాత్రలు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ గా నిలిచినవే. మరి అంతమంది హాలీవుడ్ నటుల మధ్య…

చరణ్ కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈసినిమా తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా మరో అవార్డును సొంతం చేసుకున్నాడు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చరణ్ కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈవిషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలకు కూడా ఈ అవార్డ్ దక్కింది. రామ్ చరణ్ కు ఈ అవార్డ్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మైసూరు శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా ఆర్‌సీ15గా వస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ఇక్కడి స్థానిక ప్రఖ్యాత శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కోసం మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన చిత్ర బృందంతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.

తండ్రి కలను నిజం చేసిన చరణ్
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన సినిమాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. సీతారామరాజుగా ఆర్ఆర్ఆర్ లో ఆయన చేసిన నటనకు గాను ప్రశంసల విమర్శలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేశాడు చరణ్. ఎన్నో ఏళ్ల చిరు కలను సైతం నిజం చేశాడు.

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం లభించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన.. తాజాగా మరో ఘనత సాధించారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’లో రామ్ చరణ్ స్థానం సంపాదించారు. ఈ మేరకు విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్’లో చరణ్‌కు సభ్యత్వం అందిస్తున్నట్లు వెల్లడించింది. అకాడమీ నుంచి…

రామ్ చరణ్, ఉపాసన బేబి షవర్ సెల్రబేషన్స్
మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని. ఇక ఎన్నో ఎళ్లు నుండి ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ ఇటీవలే అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్, ఉపాసన బేబీ షవర్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకలో చరణ్, ఉపాసన జంట చూడ ముచ్చటగా అనిపించారు. ఉపాసన సోదరి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వహించారు. ఇవి వారికి మరుపురాని క్షణాలుగా చెప్పవచ్చు. ఉపాసన అమ్మమ్మ ఈ వేడుకలో…

RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ పార్టీలో ప్రముఖ నటీనటులు, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా పలువురు హాజరయ్యారు. రామ్ చరణ్, ఆయన సతీమణి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే CDP
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.

బలగం మూవీపై చరణ్ ప్రశంసలు
కథలో కంటంట్ ఉంటే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది చూడకుండా సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదిస్తారన్నది చాలా సార్లు రుజువైంది. ఈమధ్య కాలంలో ఎన్నో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ లను అందుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బలగం సినిమాకు అలాంటి ఆదరణే లభిస్తుంది ఆడియన్స్ నుండి. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈసినిమా వచ్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో ఎమోషన్స్ ను బాగా చూపించడంతో అందరికీ కనెక్ట్ అవుతుంది.

ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా
తనకు బయోపిక్ తీసే ఛాన్స్ వస్తే ఆ స్టార్ క్రికెకటర్ బయోపిక్ లో నటిస్తా అని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరంటే కింగ్ విరాట్ కోహ్లీ. గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి యూఎస్ లో సండి చేసిన సంగతి తెలిసిందే కదా. తను, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటంతో ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఎంతో మంది కలలను నిజం చేస్తూ ఫైనల్ గా నాటు నాటు పాట ఆస్కార్ ను గెలుచుకొని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక చిత్రయూనిట్ తిరిగి రావడం జరిగింది.

మెగా పవర్ స్టార్ బర్త్ డే ను గ్రాండ్ గా ప్లాన్ చేసిన అభిమానులు
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.

ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ రికార్డ్
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.