మైసూరు శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్

Ram Charan Visited Sri Chamundeshwari Temple in Mysore

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌. ఆయన కథానాయకుడిగా ఆర్‌సీ15గా వస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్‌ చ‌ర‌ణ్‌ ఇక్కడి స్థానిక ప్రఖ్యాత శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన చిత్ర బృందంతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత కోచ్ రాహుల్‌ ద్రావిడ్‌ కూడా శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇక్కడి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కాగా అండర్ 19 కూచ్ బెహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటు మైసూరులో జరుగుతుండగా.. అందులో కర్ణాటక జట్టు తరపున ద్రావిడ్ తనయుడు ఆడుతున్నాడు. దీంతో కుమారుడి ఆటను వీక్షించేందుకు ద్రావిడ్ దంపతులు ఇక్కడికి వచ్చారు. ఇక ఒకేరోజు ఇద్దరు సెలెబ్రిటీలు శ్రీ చాముండేశ్వరి దర్శనానికి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రామ్ చరణ్, రాహుల్‌ ద్రావిడ్‌ లతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.

కాగా ‘గేమ్ ఛేంజర్’లో రామ్‌ చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eleven =