కథలో కంటంట్ ఉంటే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది చూడకుండా సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదిస్తారన్నది చాలా సార్లు రుజువైంది. ఈమధ్య కాలంలో ఎన్నో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ లను అందుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బలగం సినిమాకు అలాంటి ఆదరణే లభిస్తుంది ఆడియన్స్ నుండి. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈసినిమా వచ్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో ఎమోషన్స్ ను బాగా చూపించడంతో అందరికీ కనెక్ట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమాపై చాలామంది సినీ సెలబ్రిటీలు స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా చరణ్ కూడా బలగం టీమ్ ను అభినందించారు. చిత్రయూనిట్ ను ప్రత్యేకంగా ఆర్సీ 15 సెట్ కు పిలిపించి మరీ టీమ్ ను అభినందించారు. సినిమా తీసిన విధానం, నటీనటుల పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఈవిషయాన్ని మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: