చరణ్ కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్

ram charan got golden bollywood actor award

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈసినిమా తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా మరో అవార్డును సొంతం చేసుకున్నాడు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చరణ్ కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ద‌క్కింది. ఈవిషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్ల‌డించింది. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలకు కూడా ఈ అవార్డ్ దక్కింది. రామ్ చరణ్ కు ఈ అవార్డ్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − two =