
ట్యాగ్ · 18 కథనాలు


కంగువాతో క్లాష్ కు దిగుతున్న వేట్టాయాన్

వెట్టైయాన్ రిలీజ్ పై తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్

జులై నుండి తలైవా కూలీ మొదలు

వెట్టైయాన్ లో తలైవా షూటింగ్ కంప్లీట్

తలైవా వెట్టయాన్ రిలీజ్ పై క్లారిటీ

సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయాలని ఉంది

"జైలర్ "మూవీ కై హైదరాబాద్ లో భారీ సెట్స్

'రాకెట్రీ' పై సూపర్ స్టార్ ప్రశంసలు..!

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!

మరోసారి రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్..!

జపాన్ లో రజనీకాంత్ హవా

తనయ సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్

పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?

రజినీకాంత్ బర్త్ డే.. సినీ ప్రముఖుల విషెస్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రజినీకాంత్ బర్త్ డే.. విషెస్ తెలిపిన సీఎం చంద్రబాబు
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కంగువాతో క్లాష్ కు దిగుతున్న వేట్టాయాన్
సూపర్ స్టార్ రజినీకాంత్ ,సూర్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు.సూర్య కంగువా తో వస్తుండగా రజినీ వేట్టాయాన్ తోరానున్నాడు. కంగువా రిలీజ్ డేట్ ను చాలా రోజుల క్రితమే లాక్ చేశారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే సోలో రిలీజ్ కంఫర్మ్ అనుకున్న తరుణంలో అనూహ్యంగా వేట్టాయాన్ బరిలోకి దిగింది.ఈరోజే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.కంగువా దిగుతున్న రోజే అక్టోబర్ 10న ఈసినిమా కుడా వస్తుంది.

వెట్టైయాన్ రిలీజ్ పై తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్
తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా వెట్టైయాన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కతుంది. ఈసినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రజినీకాంత్ ఇప్పటికే తన షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు.

జులై నుండి తలైవా కూలీ మొదలు
ఈవయసులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

వెట్టైయాన్ లో తలైవా షూటింగ్ కంప్లీట్
గత ఏడాది జైలర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు తలైవా రజినీకాంత్. ఇదే జోష్ తో పలు సినిమాలను లైన్ లో పెట్టాడు తలైవా. అందులో వెట్టైయాన్ సినిమా కూడా ఒకటి. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. జై భీమ్ లాంటి సినిమా తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తలైవా వెట్టయాన్ రిలీజ్ పై క్లారిటీ
ఈ వయసులో కూడా రజనీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే లాల్ సలామ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

రజినీకాంత్‌తో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొత్త సినిమా
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. తాజాగా తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' చిత్రంతో ప్రేక్షకులను పలుకరించారు. తన 48 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కలిగిన ఆయన ఈ వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో 'వేట్టైయన్' (#తలైవర్170) అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న '#తలైవర్171' మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.

ప్రపంచవ్యాప్తం గా అత్యధిక వసూళ్ళు సాధించిన నెం 1తమిళ మూవీ రజనీకాంత్ 2.0
అపూర్వ రాగంగళ్ (1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ 5 దశాబాడాలుగా దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్న సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ తో పాటు మరో రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. హీరో రజనీకాంత్ మూవీస్ పై ప్రపంచవ్యాప్తం గా క్రేజ్ ఉంది. రజనీకాంత్ 2. 0 తమిళ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పటివరకూ ఏ తమిళ మూవీ బీట్ చేయలేక పోవాదం విశేషం.

సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయాలని ఉంది
ప్రతి ఒక్క డైరెక్టర్ కు ఎవరో ఒక హీరోతో చేయాలన్న కోరిక ఉంటుంది. అలానే హీరోలకు కూడా స్టార్ డైరెక్టర్ లతో చేయలన్న కోరిక ఉంటుంది. కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేయాలంటే అదో కలలానే భావిస్తుంటారు. మరి అలాంటిది రాజమౌళినే ఒక హీరోతో సినిమా చేయాలని ఉంది అని చెబితే.. అది నిజంగా గొప్ప విషయమే. ఇంతకీ రాజమౌళి సినిమా చేయాలనుకుంటున్న హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాను సౌత్ లో రాజమౌళి సమర్పిస్తున్నారు.

"జైలర్ "మూవీ కై హైదరాబాద్ లో భారీ సెట్స్
తమిళ , తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “డాక్టర్”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “జైలర్ ” తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ కథానాయిక పాత్రలో నటించే అవకాశం ఉంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం…

'రాకెట్రీ' పై సూపర్ స్టార్ ప్రశంసలు..!
తమిళ్ స్టార్ హీరో మాధవన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ కథలతో అలరించారు. ఇక మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సఖి సినిమాతో తెలుగుప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడప్పుడు తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తు మెప్పిస్తున్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాధవన్ దర్శకత్వంలో రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ అన్న సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రస్తుతం రజనీ కాంత్ తన తరువాత సినిమాకోసం రెడీ అవుతున్నారు. రజనీ తన నెక్ట్స్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమాతో రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీతో సినిమాకు సిద్దమవుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో ఇంకా పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

మరోసారి రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్..!
రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన నరసింహ సినిమా గురించి ఎప్పటికీ మరిచిపోలేరు. తమిళ్ లో వడయప్పా అన్న పేరుతో రిలీజ్ అవ్వగా.. తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ అయింది. ఇక ఈసినిమాలో రజనీకాంత్- రమ్యకృష్ణ పోటా పోటీగా నటించారు. రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాంటి పాత్రల్లో తను ఇంతకుముందే నటించాడు. కానీ నీలాంబరి పాత్రలో నటించిన రమ్యకృష్ణ పాత్ర మాత్రం సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. తను తప్పా ఆ పాత్రలో ఎవరు చేసినా ఆ రేంజ్ లో వస్తుందని చెప్పలేము. తను ఏది కోరుకుంటే అది దక్కాలి అని అనుకునే పొగరుబోతు పాత్రలో రమ్యకృష్ణ జీవించేసింది. ఇక ఈ సినిమాతో రమ్యకృష్ణ క్రేజ్ కూడా…

'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్ అందుకున్న సూపర్ స్టార్
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు జరిగిన ఈకార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను దక్కించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకున్నారు సూపర్ స్టార్. ఈ సందర్భంగా రజినీ సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన అవార్డ్ ను తనకు సీనీ రంగానికి పరిచయంచేసిన కె. బాలచందర్, అలాగే తన సోదరుడు, ఇంకా డైరెక్టర్లు, కోస్టార్లు, ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ కి అంకితం చేశారు.

జపాన్ లో రజనీకాంత్ హవా
“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ , తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు తో పాటు మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు రజనీకాంత్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.సూపర్ స్టార్ హీరోగా రూపొందిన "అన్నాత్తే " మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

తనయ సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ”తమిళ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ , హీరో రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?
భాషా : సత్య మూవీస్ బ్యానర్ పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ , నగ్మా జంటగా రూపొందిన గ్యాంగ్ స్టర్ తమిళ మూవీ "భాషా "తెలుగు డబ్బింగ్ వెర్షన్ "భాషా "ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో అద్భుతంగాపెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లోని భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే డైలాగ్ పాప్యులర్ అయ్యింది.