ఈ వయసులో కూడా రజనీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే లాల్ సలామ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. గన్ పట్టుకొని, కళ్లద్దాలతో స్టెలిష్గా రజనీకాంత్ పోస్టర్లో కనిపిస్తున్నారు.
Kuri vechachu. 🎯 VETTAIYAN 🕶️ is all set to take charge in cinemas 📽️ this OCTOBER 🗓️ Get ready to chase down the prey! 🦅😎#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4… pic.twitter.com/VXvhN8ZBdm
— Lyca Productions (@LycaProductions) April 7, 2024
కాగా మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటించనున్నారు. కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: