తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా వెట్టైయాన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కతుంది. ఈసినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రజినీకాంత్ ఇప్పటికే తన షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి ఈసినిమాను దసరా బరిలోకి అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే కదా. కానీ తలైవా రజనీకాంత్ తాజాగా ఈసినిమా రిలీజ్ పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఓ ఎయిర్ పోర్ట్ లో రిపోర్టర్ లతో ముచ్చటించిన రజినీ ఇండియన్2 సినిమా చూశాను చాలా బాగుంది అన్నారు. ఇంకా వెట్టైయాన్ గురించి చెబుతూ ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇంకా లాక్ చేయలేదు.. డబ్బింగ్ పనులు అయితే జరుపుకుంటుంది అని తెలిపారు. కూలీ సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. కూలీ షూటింగ్ మొదలైంది.. చాలా బాగా జరుగుతుంది..అన్నారు. దీంతో ఇప్పటివరకూ అక్టోబర్ 10వ తేదీన వస్తుందనుకున్న వెట్టైయాన్ రిలీజ్ గురించి తలైవా స్టేట్ మెంట్ తో మరోసారి కన్ఫ్యూజన్ నెలకొంది. మరి దీనిపై క్లారిటీ త్వరలోనే చిత్రయూనిట్ ఇస్తుందేమో చూడాలి.
కాగా ఈసినిమాలో ఇంకా మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, జీఎం సుందర్, రోహిణి, రావు రమేష్ పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబస్కరన్ నిర్మిస్తున్న ఈసినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























